Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
స్పీడ్‌గా కోలుకున్న గోపీచంద్.. మళ్ళీ యాక్షన్‌కు రెడీ!
యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. కొన్ని రోజుల క్రితం గోపీచంద్ షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే. గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడన్న వార్తతో టాలీవుడ్ లో గందరగోళం నెలకొంది. చివరకు అది చిన్న గాయమే అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ప్రస్తుతం గోపీచంద్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు రెడీ అయిపోతున్నాడట. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర విడుదల తేదీ, ఇతర వివరాలు తెలియనున్నాయి. ఇదిలా ఉండగా గోపిచంద్ మరోమారు సంపత్ నంది దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

గోపీచంద్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. సినిమా సినిమాకు అతడి మార్కెట్ పడిపోతోంది. ఇలాంటి సమయంలో తప్పనిసరిగా ఓ హిట్ చిత్రం పడాలి. లేకుంటే గోపీచంద్ కెరీర్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కెరీర్ ఆరంభంలోనే గోపీచంద్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రణం, ఆంధ్రుడు లాంటి చిత్రాలు విజయం సాధించాయి.