Gurtundha Seethakalam ఈ జనరేషన్‌కు గీతాంజలి లాంటి మూవీ.. సత్యదేవ్
గాడ్ ఫాదర్ సినిమాతో నటుడిగా మరోమెట్టు ఎక్కిన హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కావ్య శెట్టి, మేఘా ఆకాశ్ నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. కన్నడ దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చినబాబు, ఎం, సుబ్బారెడ్ది లు సమర్సించారు. డిసెంబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 3వ తేదీన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సత్యదేవ్ మాట్లాడుతూ..
గుర్తుందా శీతాకాలం సినిమాలో నాలుగు విభిన్నమైన ప్రేమ కథలు ఉంటాయి. మనిషి జీవితంలో ఉండే నాలుగు దశల్లో జరిగే ప్రేమ కథలే ఈ సినిమా. జీవితం నాలుగు దశలు దాటిన వారికి, ప్రజెంట్‌గా అనుభవించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఇంతకంటే మంచి సినిమాను ఎవరు తీయలేరేమో. లక్ష్మీ భూపాల రాసిన డైలాగ్స్ మాకు చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాం. సినిమా కథ, సన్నివేశాలు విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యామో.. అదే రేంజ్‌లో తెరపైన ఆవిష్కరించడంలో దర్శకుడు నాగశేఖర్ సక్సెస్ అయ్యారు. ఈ తరానికి గుర్తుందా శీతాకాలం సినిమా గీతాంజలి సినిమా లాంటింది. మాటల రచయిత లక్ష్మీ భూపాల పెన్, పేపర్‌తోపాటు ప్రేమను కూడా పెట్టి నా సినిమా కోసం రాశారు. కాలభైరవ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఈ శీతాకాలంలో గుర్తుండిపోయే సినిమా గుర్తుందా? శీతాకాలం అని సత్యదేవ్ అన్నారు.

నటీనటులు: సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు
స్కీన్ ప్లే, డైరెక్షన్: నాగశేఖర్
బ్యానర్: వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పకులు: ఎమ్‌ఎస్ రెడ్డి, చినబాబు
నిర్మాతలు: రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్,
కొరియోగ్రఫి: వీజే శేఖర్
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి
డైలాగ్స్: లక్ష్మీ భూపాల్
మ్యూజిక్: కాలభైరవ
ఎడిటిర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రాఫర్: సత్య హెగ్డే
స్టంట్స్: వెంకట్
పీఆర్వోలు: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్


Click it and Unblock the Notifications











