twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Prabhas: ప్రభాస్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. రెమ్యూనరేషన్‌తో రికార్డు.. తొలి ఇండియన్ హీరోగా ఘనత

    |

    రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఎదిగిపోయాడు ప్రభాస్. చాలా కాలం పాటు తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన అతడు.. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంతేకాదు, అప్పటి నుంచి ఏక కాలంలో వరుసగా అన్నీ భారీ సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి చూద్దాం!

     గోదావరి నుంచి నేషనల్ రేంజ్‌కు

    గోదావరి నుంచి నేషనల్ రేంజ్‌కు


    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు జన్మించాడు. సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు అతడికి పెదనాన్న అవుతారు. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు గోపీకృష్ణ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలను నిర్మించారు. అలా గోదావరి జిల్లా నుంచి వచ్చి ఇప్పుడు నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయాడు.

    బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా సమీరా రెడ్డి.. అబ్బా ఏం ట్విస్ట్ ఇచ్చింది గురూ!బాత్‌టబ్‌లో బట్టలు లేకుండా సమీరా రెడ్డి.. అబ్బా ఏం ట్విస్ట్ ఇచ్చింది గురూ!

     అలా వచ్చాడు... స్టార్ హీరో రేంజ్

    అలా వచ్చాడు... స్టార్ హీరో రేంజ్

    ప్రభాస్ 'ఈశ్వర్' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయం అయ్యాడు ప్రభాస్. ఇది బాగానే ఆడినా.. భారీ సక్సెస్ మాత్రం కాలేదు. ఆ తర్వాత చేసిన రాఘవేంద్ర నిరాశనే మిగిల్చింది. అయితే, దీని తర్వాత వచ్చిన 'వర్షం' మాత్రం ప్రభాస్‌కు భారీ హిట్‌ను అందించింది. దీంతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా అందుకుని స్టార్‌ హీరోగా మారిపోయాడు.

     వరుస ఫ్లాపులు.. వరుస సక్సెస్‌లు

    వరుస ఫ్లాపులు.. వరుస సక్సెస్‌లు


    'వర్షం' తర్వాత ప్రభాస్ చేసిన పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి తీసిన 'ఛత్రపతి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు వరుస పరాజయాలతో ప్రభాస్ సతమతం అయ్యాడు. ఈ క్రమంలోనే 'డార్లింగ్', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' వంటి హిట్లు కొట్టాడు.

    పబ్లిక్ ప్లేస్‌లో రెచ్చిపోయిన శ్రీయ: అతడి నోట్లో నోరు పెట్టేసి మరీ!పబ్లిక్ ప్లేస్‌లో రెచ్చిపోయిన శ్రీయ: అతడి నోట్లో నోరు పెట్టేసి మరీ!

     ‘మిర్చి' లాంటోడు... బాహుబలి

    ‘మిర్చి' లాంటోడు... బాహుబలి


    కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'మిర్చి'తో ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే దర్శకుధీరుడు రాజమౌళితో 'బాహుబలి' సిరీస్ చేశాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అలాగే, విదేశాల్లోనూ క్రేజ్‌ను ఏర్పరచుకున్నాడు.

    అన్నీ అలాంటి సినిమాలే చేస్తూ

    అన్నీ అలాంటి సినిమాలే చేస్తూ


    'బాహుబలి' తర్వాత ప్రభాస్ 'సాహో' అనే సినిమా చేశాడు. ఇది హిందీలో బాగా ఆడడంతో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత 'రాధే శ్యామ్'తో వచ్చిన ఇది డిజాస్టర్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ K', 'స్పిరిట్' వంటి భారీ నుంచి అతి భారీ చిత్రాలు చేస్తున్నాడు. అలాగే, మారుతితోనూ ఓ ప్రాజెక్టు ఓకే చేసేశాడు.

    షర్ట్ విప్పేసి షాకిచ్చిన యంగ్ హీరోయిన్: ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ షోషర్ట్ విప్పేసి షాకిచ్చిన యంగ్ హీరోయిన్: ఎద అందాలను ప్రదర్శిస్తూ హాట్ షో

    ప్రభాస్‌ రికార్డులు... ఏకైక హీరోగా

    ప్రభాస్‌ రికార్డులు... ఏకైక హీరోగా

    హీరోగా తన సినీ కెరీర్‌లో ప్రభాస్ ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మరీ ముఖ్యంగా బాహుబలితో వేయి కోట్లు దాటిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డు అందుకున్నాడు. అలాగే, మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి సౌతిండియన్ స్టార్ ప్రభాసే. ఇవే కాదు.. ఇంకా ఎన్నో సాధించాడు. ఎన్నో అవార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

     ప్రభాస్ ఆస్తులు, నికర ఆదాయం

    ప్రభాస్ ఆస్తులు, నికర ఆదాయం


    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు దాదాపు రూ. 250 కోట్ల నికర ఆదాయం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే, అతడికి దాదాపు 200 కోట్ల విలువున్న ఇళ్లు కూడా ఉన్నాయని తెలిసింది. అలాగే, ప్రభాస్‌కు 15 కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉన్నాయట. అంతేకాదు, మిగతా యాక్ససిరీస్‌ల విలువ రూ. 10 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా.

    <strong>స్టార్ హీరోయిన్‌‌ను ఇబ్బంది పెడుతున్న నిర్మాత: పెళ్లి చేసుకోకుండా అలా చేయమంటూ!</strong><br />స్టార్ హీరోయిన్‌‌ను ఇబ్బంది పెడుతున్న నిర్మాత: పెళ్లి చేసుకోకుండా అలా చేయమంటూ!

     ప్రభాస్ రెమ్యూనరేషన్‌ ఎంతంటే

    ప్రభాస్ రెమ్యూనరేషన్‌ ఎంతంటే


    నేషనల్ స్టార్ ప్రభాస్ గతంలో ఒక్కో సినిమాకు రూ. 5 - 7 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. కానీ, 'బాహుబలి' తర్వాత అతడి రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఏకంగా అతడు రూ. 100 - 150 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా గతంలో ఎవరూ ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ పరంగానూ రికార్డు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.

    సినీ హీరోగా ప్రభాస్ ఎన్నో విజయాలను చూడాలని.. తెలుగు సినిమా స్టామినాను మరింత పెంచాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున పాన్ ఇండియా స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

    English summary
    Pan India Star Hero Prabhas Birthday Today. On The Occasion of His Birthday.. Let we Know about his Net Worth and Remuneration Details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X