twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Kartikeya హ్యాపీ బర్త్ డే కార్తీకేయ.. క్రేజ్ పెంచిన బెదురులంక 2012 టైటిల్

    |

    RX 100 మూవీతో ఓవర్‌నైట్ స్టార్ హీరోగా మారిన కార్తీకేయ గుమ్మకొండ వరుస చిత్రాలతో తన రేంజ్‌ను పెంచుకొంటూ వెళ్లున్నారు. నేచురల్ స్టార్ నానితో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు. అంతటితో ఆగకుండా ఇటీవల తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్‌తో కలిసి విలన్ పాత్రతో దక్షిణాదిలోకి అడుగుపెట్టారు. హీరోగా, విలన్‌గా నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇలా కేరీర్ పరంగా దూసుకెళ్తున్న కార్తీకేయ గుమ్మకొండ జన్మదినం సెప్టెంబర్ 21వ తేదీ. ఆయన జన్మదినం సందర్భంగా బెదురులంక 2012‌ టైటిల్‌ను ఆవిష్కరించారు.

    డీజే టిల్లు బేబీ నేహా శెట్టి జంటగా

    డీజే టిల్లు బేబీ నేహా శెట్టి జంటగా

    డీజే టిల్లుతో కుర్రకారులో హుషారు పుట్టించిన నేహా శెట్టితో కలిసి కార్తీకేయ నటిస్తున్న బెదురులంక 2012 చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. గతంలో కలర్ ఫోటో సినిమాతో ఈ నిర్మాత జాతీయ అవార్డు అందుకొన్న సంగతి తెలిసిందే. సీ యువరాజ్ సమర్పిస్తున్న ఈ చిత్రం లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ రూపొందిస్తున్నారు.

     సిరివెన్నెల పాట రాశారంటూ

    సిరివెన్నెల పాట రాశారంటూ


    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మా హీరో కార్తికేయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనబ‌ర్త్‌డే సందర్భంగా టైటిల్ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల చేస్తాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ షూట్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. స్వర్గీయ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు అని అన్నారు.

     డ్రామెడీ చిత్రంగా అంటూ దర్శకుడు

    డ్రామెడీ చిత్రంగా అంటూ దర్శకుడు


    దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ.. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతోకూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టుజీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టుబతకడం రైటా? అనేది సినిమాలోచూడాలి అని చెప్పారు.

    బెదురులంకలో తెర ముందు.. తెర వెనుక

    బెదురులంకలో తెర ముందు.. తెర వెనుక


    నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు
    యాక్షన్: అంజి, పృధ్వీ
    కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల
    పిఆర్వో: పులగం చిన్నారాయణ
    ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం
    సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య
    ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల
    ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా
    సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
    కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్
    సంగీతం: మణిశర్మ
    సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల
    సమర్పణ: సీ యువరాజ్
    నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని
    రచన, దర్శకత్వం: క్లాక్స్

    English summary
    Young Hero Kartikeya Gummakonda is celebration his birthday on September 21st. In this occassion, Producer Ravindra Benerjee announced his movie title Bedurulanka 2012
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X