Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చావు కబురు చల్లగా కోసం హీరో కష్టాలు.. జిమ్‌లో కష్టపడుతోన్న కార్తికేయ
ఆర్ ఎక్స్ 100 చిత్రంతో యూత్‌లో భారీగా క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ. యూత్ స్టార్‌గా మాస్ ఇమేజ్ కోసం పరితపించాడు. ఆ క్రమంలో ప్రేక్షకులను మెప్పించేందుకు భారీగానే కష్టపడ్డాడు. అయితే ఆర్ ఎక్స్ 100 అంతటి గుర్తింపును మాత్రం తీసుకురాలేకపోయింది. చేసిన ప్రయత్నాలన్నీ కార్తికేయకు నిరాశనే మిగిలిస్తూ వచ్చాయి. అందుకే ఈ సారి మాత్రం కొత్తగా ట్రై చేద్దామని వెరైటీ కాన్సెప్ట్‌తో వస్తోన్న చావు కబురు చల్లగా అనే చిత్రాన్నిచేస్తున్నాడు.
కార్తీకేయ అతికొద్ది కాలంలోనే తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. అందుకే ఈ యంగ్ హీరోకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అందులో ప్రస్తుతం చావు కబురు చల్లగా సెట్స్ పైకి వచ్చింది. ఆ మధ్యే ఈ మూవీ పూర్తి కావాల్సింది కానీ కరోనా లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అప్పటి నుంచి నిరంతరాయంగా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు.

లాక్డౌన్‌లో ఈ హీరో ఎంతగా వర్కవుట్లు చేశాడో అందరికీ తెలిసిందే. బయట జిమ్‌లు ఓపెన్ చేయడం లేదని ఇంట్లోనే వెరైటీ వర్కవుట్లు చేశాడు. తాజాగా సినిమా కోసం మరింత బాడీని పెంచేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఈ వీడియోలు కార్తీకేయ బాడీని చూస్తే ఆర్ఎక్స్ 100 సినిమా కంటే మించి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ హీరో జిమ్‌లో బాగానే చెమటోడ్చుతున్నాడని కామెంట్లు వస్తున్నాయి. చావు కబురు చల్లగా అనే చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.