twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sebastian PC 524 ప్యాన్ ఇండియా సినిమా.. అన్నిభాషల్లోకి ప్లాన్.. ఎప్పటికీ గుర్తుండి పోతుంది.. కిరణ్ ఎమోషనల్

    |

    SR కల్యాణ మండపం, రాజావారు రాణిగారు లాంటి వరుస హిట్లతో యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల్లో తనదైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకొన్నారు. మూడో సినిమాకే మంచి క్రేజ్‌ను సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఒక విభిన్నమైన కథాంశంతో ఫిబ్రవరి 25వ తేదీన సెబాస్టియన్ PC 524 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్దారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.

    Recommended Video

    Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame

    ప్రమోద్, రాజు, జయచంద్రా రెడ్డి, కె ఎల్ మదన్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నమ్రతా దారేకర్ , కోమలి ప్రసాద్, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది.. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ..

     15 నిమిషాలు కథ వినగానే..

    15 నిమిషాలు కథ వినగానే..

    రాజావారు రాణిగారు సినిమా పూర్తయిన తర్వాత బాలాజీ SR కళ్యాణమండపం షూట్‌లో కలవడం జరిగింది. సెబా అనే క్యారెక్టర్ గురించిన కథ 15 నిమిషాలపాటు వినగానే నచ్చింది. వెంటనే ఈ కథ చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాను తెలుగు, తమిళ్‌లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సెబాస్టియన్ అనే క్యారెక్టర్ చాలామందికి ఎప్పటికి గుర్తుండిపోతుంది.

    ఎందుకంటే.. చంటి సినిమాలో బ్రహ్మానందం గారు 15 నిమిషాలపాటు రేచీకటి క్యారెక్టర్ చేస్తేనే అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. అలాంటిది సినిమా మొత్తం అలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని అనుకొన్నాను. ఈ క్యారెక్టర్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని చేశాను అని కిరణ్ అబ్బవరం తెలిపారు.

    మదనపల్లిని కొత్తగా చూపించాం...

    మదనపల్లిని కొత్తగా చూపించాం...

    సెబాస్టియన్ PC 524 సినిమా ప్రేక్షకులను 100% వినోదాన్ని అందిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతోందని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం. సెబా క్యారెక్టర్ నేను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

    మదనపల్లిని కొత్తగా చూయించారు. ఈ కథ మన పక్కింటి వాడి కథలా ఉంటుంది. రాజన్న, ప్రమోద్,అన్నలు, సిద్దారెడ్డి మామ లకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అని నాకు సపోర్ట్ గా నిలుస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. జిబ్రాన్ మంచి సంగీతం అందించారు హీరోయిన్ నమ్రత, కోమలి ,పాటు 24 క్రాఫ్ట్డ్ అందరూ చాలా కష్టపడి చేశారు. ఫిబ్రవరి 5న టీజర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని కిరణ్ అబ్బవరం అన్నారు.

    తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోకి..

    తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోకి..

    ఇక సెబాస్టియన్ PC చిత్రం ప్యాన్ ఇండియా స్టామినా ఉన్న స్టోరి. ప్రస్తుతం తమిళం, తెలుగులోనే విడుదల చేస్తున్నాం. మిగితా భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. చిత్ర యూనిట్‌తో చర్చలు జరుపుతున్నాం. తమిళంలో ఎలా? ఎప్పుడు రిలీజ్ చేయాలనే ప్లాన్ గురించి కసరత్తు చేస్తున్నాం. త్వరలోనే తమిళంలో ఈ సినిమాను విడుదల చేసే డేట్‌ను ప్రకటిస్తాం అని కిరణ్ అబ్బవరం తెలిపారు.

    కిరణ్ కనిపించడు.. సెబాస్టియన్ మాత్రమే

    కిరణ్ కనిపించడు.. సెబాస్టియన్ మాత్రమే

    ఇంతకుముందు గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్‌లో అసోసియేట్‌గా వర్క్ చేశాను. టాక్సీవాలా, ద్వారక సినిమాలకి పని చేశాను. ఆ తర్వాత నేను ఒక కొత్త కథ రాసుకొని చాలామందికి చెప్పడం జరిగింది. అయితే నా స్నేహితుడి ద్వారా కిరణ్‌ను కలిసి కథ చెప్పడం జరిగింది. రేచీకటి సమస్యతో బాధపడే సెబాస్టియన్ అనే కానిస్టేబుల్‌ను తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనే కథను చెప్పాను.

    స్టోరి బాగుందని వెంటనే చెప్పి ఈ సినిమా చేద్దామన్నాడు. మదనపల్లె రూరల్ బ్యాక్ డ్రాప్‌లో చేయడం నాకు కొత్తగా అనిపించింది. 32 రోజుల్లో ఏకధాటిగా షూటింగ్ చేసి పూర్తి చేసుకున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూస్తున్న మీకు కిరణ్ కనిపించడు సెబాస్టియన్ కనిపించేలా చాలా ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ చేశాడు అని చిత్ర దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి తెలిపారు.

    ప్రేక్షకుడి హృదయంలో స్థానం

    ప్రేక్షకుడి హృదయంలో స్థానం

    సెబాస్టియన్ PC 524 సినిమా చూసి బయటికి వచ్చిన వారందరికీ సెబాస్టియన్ క్యారెక్టర్ ప్రేక్షకుడి హృదయంలో కొన్ని రోజులపాటు ఉండిపోతుంది. ఈ చిత్రంలో ప్రతి క్యారెక్టర్‌కు డార్క్ షేడ్ ఉంటుంది. ఈ కథ రాసుకున్నప్పుడే జిబ్రాన్ మ్యూజిక్ ఇమేజింగ్ చేసుకున్నాను. ఈ చిత్రంలో ఆర్ట్ వర్క్ రియలిస్టిక్‌గా ఉంటుంది. నిర్మాత నాకు ఫుల్ సపోర్ట్ చేశారు, కిరణ్ సొంత బ్రదర్‌లా నాకు సపోర్ట్‌గా నిలిచాడు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎమోషన్, థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 25న విడుదల అవుతుంది బాలాజీ సయ్యపురెడ్డి అన్నారు.

    Sebastian PC 524 నటీనటులు, సాంకేతిక నిపుణులు

    Sebastian PC 524 నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: కిరణ్ అబ్బవరం, నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ తదితరులు
    నిర్మాణ సంస్థ: ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్,
    బ్యానర్ : జ్యోవిత సినిమాస్
    నిర్మాత: సిద్దారెడ్డి బి,
    సహ నిర్మాతలు : ప్రమోద్‌, రాజు
    ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ : కె ఎల్ మదన్
    కథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి
    సంగీతం: జిబ్రాన్‌,
    డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ,
    పబ్లిసిటీ & మార్కెటింగ్: చవన్ ప్రసాద్,
    డీఐ: సురేష్ రవి,
    సౌండ్: సింక్ సినిమాస్ సచిన్ సుధాకరన్,
    ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి,
    కళ: కిరణ్‌ మామిడి,
    కూర్పు: విప్లవ్‌ న్యసదాం,
    పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు - ఫణి కందుకూరి
    (బియాండ్‌ మీడియా)

    English summary
    After debuting in 'Raja Varu Rani Varu', Kiran Abbavaram scored a blockbuster with 'SR Kalyanamandapam' in 2021. Kiran is now a hero with huge popularity among the Telugu audience. By choosing the right projects, he has become a busy actor. His upcoming movie, 'Sebastian P.C. 524', is a village-based story that is also about pure love. A comedy thriller, it is coming against the backdrop of a hero with night blindness. Written and directed by Balaji Sayyapureddy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X