పెళ్లి కాగానే నా కొడుకుని లాగేసుకుని.. కోడలిపై నాగశౌర్య తల్లి షాకింగ్ కామెంట్స్
మంచి బ్యాక్‌గ్రౌండ్, అందమైన రూపం, నటన ఉన్నప్పటికీ కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోతున్నారు యువ హీరో నాగశౌర్య. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో ఆయన సినీ ప్రస్థానం డైలామాలో పడింది. చివరిగా రంగబలి అనే సినిమాలో నటించిన శౌర్య.. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో గ్యాప్ తీసుకున్నాడు. సినిమాలు ఫెయిల్ అవుతుండటంతో ఆచితూచి కథలు ఎంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నాగశౌర్యపై ఆయన తల్లి ఉష మూల్పూరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
హీరోగా పోరాటం
2011లో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ కుర్రాడు.. ఊహలు గుసగుసలాడే సినిమాతో బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, జాదూగాడు, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జో అచ్యుతానంద, నీ జతలేక, కథలో రాజకుమారి, ఛలో, కణం, దియా, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల, ఓ బేబీ వంటి సినిమాలలో నటించారు. ఇక హిట్ కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయి తీసిన లక్ష్య చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వరుడు కావలెను, కృష్ణ వృందా విహారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలలో నటించారు నాగశౌర్య.

చేతిలో మూడు సినిమాలు
చివరి సారిగా 2023లో రంగబలి అనే సినిమాలో నటించగా.. అది కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ కుర్రాడు.. ప్రస్తుతం పోలీస్ వారి హెచ్చరిక, బ్యాడ్ బాయ్ కార్తీక్, నారీ నారీ నడుము మురారి సినిమాలలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఖచ్చితంగా ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరించాలని నిర్ణయించుకున్నారు నాగశౌర్య. కాగా.. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని నాగశౌర్య ఫాంహౌస్‌లో పేకాట ఆడుతూ కొందరు ప్రముఖులు పట్టుబడటం తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆ తర్వాత అభిమానిని హత్య చేసిన కన్నడ నటుడు దర్శన్‌కు మద్ధతుగా నాగశౌర్య పెట్టిన పోస్ట్ వివాదాస్పదమైంది.
కన్నడ అమ్మాయితో పెళ్లి
కాగా.. మూడేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో నాగశౌర్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఇన్నాళ్లూ అమ్మానాన్నలతో కలిసే ఉన్న నాగశౌర్య.. ఇప్పుడు వారికి దూరంగా వేరు కాపురం పెట్టాడట. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగశౌర్య తల్లి ఉష మూల్పూరి ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్నప్పటి నుంచి నాగశౌర్య ఓ మాట అనేవాడు.. మ్యారేజ్ అయ్యాక నేను మీతో ఉండనని, ఎందుకంటే ఇద్దరు మంచోళ్లు ఒకటే చోట ఉండకూదు అనేవాడు. నేను మంచిదానిని నీకు తెలుసు, మరి నీకు వచ్చే అమ్మాయి ఎలా మంచిదని నీకు తెలుసు అని అడిగా. ఫస్ట్ నుంచి వాడి మైండ్‌లో ఫిక్స్ అయ్యింది కాబట్టి, మ్యారేజ్ అవ్వగానే వేరు కాపురం పెట్టేశాడు అని ఉష మూల్పూరి తెలిపారు.
నా కోడలు డైనమిక్
ఎవరి ప్రైవసీ వాళ్లకి ఉండాలి.. వాళ్ల ఫ్రెండ్స్ వస్తారు, వారికి సరదాలు వారికి ఉంటాయి. నా ఇద్దరు పిల్లలు పది రోజులకోసారి వస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరికి వాళ్లు దూరంగానే ఉంటున్నారు.. నా ఇద్దరి కోడళ్లు బంగారమే. ఇద్దరూ అమ్మా అనే పిలుస్తారు. వాళ్లు ఎలా పిలిచారో మనం కూడా అలాగే ఉండాలని, కూతురిగా చూసుకుంటున్నామని ఉష తెలిపారు. చిన్న కోడలు చాలా ప్రతిభావంతురాలు.. బెంగళూరులో బిజినెస్ చూసుకుంటూనే, నాగశౌర్య వ్యవహారాలు చూసుకుంటోంది అని కోడలిపై ప్రశంసలు కురిపించారు ఉష. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











