Don't Miss!
- News
చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ప్రభాస్ కొత్త చిత్రానికి టైటిల్ ఇదే.. ట్రెండీగా ఉంది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాల జోరు పెంచుతున్నాడు. ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తూనే.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో మరో చిత్రాన్ని ప్రారంభించాడు. గత ఏడాదే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాధాకృష ఈ చిత్రాన్ని 1960నాటి పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ వింటేజ్ కార్ల వ్యాపారిగా ఈ చిత్రంలో కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ చిత్ర టైటిల్ దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విజివాల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న కమల్ కణ్ణన్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చిత్రం గురించి మాట్లాడారు. ఆయన మాటలని బట్టి ప్రభాస్, రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న చిత్ర టైటిల్ 'జాన్' అని అభిమానులు నిర్ధారణకు వచ్చేశారు. ఇటీవల జాన్ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ముందుగా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అని కమల్ కణ్ణన్ అన్నారు.

కమల్ కణ్ణన్ అనుకోకుండా జాన్ అని ప్రస్తావించడంతో ప్రభాస్ 20 వ చిత్ర టైటిల్ బయట పడింది. టైటిల్ సింపుల్ గా, ట్రెండీగా ఉందని అభిమానులు అంటున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సాహో ఆగష్టు 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.