For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జూనియర్ ఎన్టీఆర్‌పై షాకింగ్ రూమర్లు.. నందమూరి ఫ్యాన్స్‌లో ఆందోళన.. కారణం ఇదే!

  By Manoj Kumar P
  |

  వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఒకానొక సమయంలో ఎన్నో ఫ్లాపులు పలకరించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' నుంచి అతడు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాతో మొదలు పెట్టి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత'తో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి ఓ వార్త ప్రచారం అవుతోంది.

  దీంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, ఆందోళనకు కూడా గురయ్యారు. అయితే, దీని గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఎన్టీఆర్ గురించి వచ్చిన వార్త ఏంటి..? నందమూరి ఫ్యాన్స్ ఏమనుకున్నారు..? వివరాల్లోకి వెళితే..

  మార్కెట్ పెరిగిపోయింది

  మార్కెట్ పెరిగిపోయింది

  వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక్.. టాప్ పొజిషన్‌పై కన్నేశాడు. ఈ క్రమంలోనే ఒక దాని తర్వాత మరొకటి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో వ్యాపార ప్రకటనలు కూడా చేస్తూ బిజీ అయిపోయాడు. కొన్ని చానెళ్లకు బ్రాండ్ అంబాసీడర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఇలా ఫుల్ ఫామ్‌లో ఉన్న తారక్.. తన మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. దీంతో భారీగా ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు.

  స్టామినా చూపించేందుకు సరికొత్తగా

  స్టామినా చూపించేందుకు సరికొత్తగా

  ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR'లో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని భాషల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడట. వాస్తవానికి తారక్‌కు తమిళ, హిందీ భాషలపై మంచి పట్టు ఉంది. అతడు కన్నడంలోనూ గతంలో ఓ పాటను కూడా పాడడు. తన స్టామినాను అన్ని భాషల ప్రేక్షకులకు చూపించడానికే తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్.

  తర్వాత సినిమా విషయంలో మాత్రం

  తర్వాత సినిమా విషయంలో మాత్రం

  జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం ‘RRR' తప్ప మరో సినిమా లేదు. అయితే, కన్నడలో వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం అయిన ‘కేజీఎఫ్' డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో తారక్ తర్వాతి సినిమా ఉంటుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, తారక్.. త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నాడని కూడా వార్తలు వెలువడ్డాయి. వీళ్లిద్దరితో పాటు తమిళ దర్శకుడు అట్లీతో సినిమా ఉంటుందని కూడా టాక్ ఉంది. కానీ, వీరిలో ఎవరితో తారక్ సినిమా ఉంటుందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.

  నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్

  నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్

  ప్రస్తుతం హీరోగా ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలోనే మరో బాధ్యతలను చేపట్టబోతున్నాడని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదే.. ఆయన ప్రొడక్షన్ హౌస్ స్థాపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. తారక్‌కు నటనపైనే కాకుండా 24 క్రాఫ్ట్స్‌పైనా మంచి పట్టుంది. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

  నందమూరి అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు

  నందమూరి అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు

  తారక్.. నిర్మాతగా మారబోతున్నాడని, త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించబోతున్నాడని వార్తలు వచ్చినప్పటి నుంచి నందమూరి అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ వార్తలను స్వాగతించగా.. మరికొందరు మాత్రం అఇష్టత చూపారు. దీనికి కారణం.. తారక్ అన్నయ్య కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్‌ను నడుపుతుండడమే. అన్నది ఉండగా.. తమ్ముడు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం వాళ్లకు నచ్చలేదని టాక్.

  Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
  ప్రస్తుతం ఉంది అదొక్కటే

  ప్రస్తుతం ఉంది అదొక్కటే

  టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ప్రస్తుతం ‘RRR'లో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమరం భీంగా కనిపించనుండగా, రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

  English summary
  After Mahesh Babu who ventured into film production and floated his own banner GMB Entertainment, it is going to be the turn of Jr NTR. It is learnt that Tarak also has plans of producing his own films and likely to start his own banner very soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X