twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూర్తిగా దివాళా తీశా.. ఇంటిని అమ్మేసి రోడ్డుపైకి.. నా కొడుకు వల్లే అంతా.. జాకీ ష్రాఫ్ షాకింగ్‌గా!

    |

    'సినిమా ఇండస్ట్రీలో ఉజ్వలంగా ఎదిగి పాతాల లోకంలోకి పడిపోయిన సినీ తారలు ఎక్కువ మందే కనిపిస్తారు. ఆర్థికపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు వారిని కిందకు ఎలా తోస్తాయో అనే విషయాన్ని అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లను చూస్తే తెలుస్తుంది. అలాగే కష్టాలను సమర్ధవంతంగా ఎదురించి మళ్లీ ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా బిగ్‌బీని చూసి స్పూర్తి పొందవచ్చు. అదే దారిలో జాకీ ష్రాఫ్‌ ప్రయాణించాడు. ఓ దశలో దివాలా తీసిన ఆ నటుడు మళ్లీ ఎలా కుదురుకొన్నారనే విషయాన్ని తాజాగా బాలీవుడ్ మీడియాతో పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

     90వ దశకంలో హీరోగా వెండితెరపై

    90వ దశకంలో హీరోగా వెండితెరపై

    బాలీవుడ్‌లో 90వ దశకంలో రారాజులా బతికిన వారిలో అమితాబ్ బచ్చన్, జాకీ ష్రాఫ్ ఒకరు. అమితాబ్ సూపర్ స్టార్‌గా ఉండగానే నిర్మాతగా మారారు. అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ పెట్టి సినిమాలను తెరకెక్కించారు. అయితే సినిమాలు ఆడకపోవడం, ఆ సంస్థ నిర్వహించిన ఈవెంట్లు వివాదానికి గురికావడం లాంటి అంశాలు అమితాబ్‌ను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. ఆ క్రమంలో మళ్లీ పుంజుకొని కేబీసీ, వరుసగా సినిమాలు తీస్తూ మళ్లీ తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకొన్నారు.

    వ్యాపారంలో ఆ విధంగా నష్టాలు

    వ్యాపారంలో ఆ విధంగా నష్టాలు

    అలాగే యాడ్ ఇండస్ట్రీలో మోడల్‌గా రాణిస్తూ.. హీరో సినిమా ద్వారా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన జాకీ ష్రాఫ్ కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. అయితే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఆ విషయాన్ని వివరిస్తూ.. వ్యాపారంలో నష్టపోవడంతో ఇంటిని అమ్మివేయాల్సి వచ్చింది. ఆర్థిక సమస్యలను తట్టుకోలేకపోయాను అని జాకీ ష్రాఫ్ బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు.

    నా ఫ్యామిలికి చెడ్డపేరు రాకుండా

    నా ఫ్యామిలికి చెడ్డపేరు రాకుండా

    వ్యాపార రంగంలో చవిచూసిన నష్టాలను గురించి జాకీ ష్రాఫ్ నర్మగర్భంగా వెల్లడిస్తూ.. ఏదో ప్రయత్నం చేశాను.. ఏదో జరిగి తీవ్రమైన నష్టాలను చూడాల్సి వచ్చింది. అప్పులు బారిన పడటంతో వాటిని స్వయంగా తీర్చాల్సి వచ్చింది. ప్రతీ ఒక్కరికి నేను రుణాలను చెల్లించి నా ఫ్యామిలీకి చెడ్డ పేరు తీసుకు రాకుండా చేశాను. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రతీసారి లాభాలను ఆశించడం కష్టం. కొన్నిసార్లు పై నుంచి కిందపడటం.. కింది నుంచి పైకి ఎదగడం సంభవిష్తాయి అని జాకీ ష్రాప్ చెప్పారు.

    టైగర్ ష్రాఫ్‌ను చూస్తే గర్వంగా

    టైగర్ ష్రాఫ్‌ను చూస్తే గర్వంగా

    అయితే నా కుమారుడు టైగర్ ష్రాఫ్ నా అప్పులు తీరడానికి సరైన సమయంలో ఆదుకొన్నారు. నా పిల్లల్ని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. అప్పుల్లో కుదువ పెట్టిన ఇంటిని టైగర్ ష్రాఫ్ నాకు అప్పగించారు. అయితే ఆ ఇంటిని తిరిగి తీసుకోవడం నా భార్యకు ఇష్టం లేదు. పోయిందేదో పోయింది.. ఇక దాని గురించి ఆలోచించకు అంటూ నా భార్య అంటుండేది అని జాకీ ష్రాఫ్ చెప్పారు.

    Recommended Video

    Prabhas Hrithik Roshan Multi Starrer On Cards | Prabhas 24
    నా ఇంటిని తిరిగి తెచ్చి..

    నా ఇంటిని తిరిగి తెచ్చి..

    అయితే తన తల్లిదండ్రులకు ఇష్టమైన ఇంటిని మళ్లీ ఇవ్వడానికి నా కుమారుడు టైగర్ ష్రాఫ్ చాలా కష్టపడ్డారు. ఏదైనా అసాధారణ విషయాన్ని సాధించాలనే పట్టుదల నా కొడుకులో ఉండటం చాలా సంతోషంగా ఉంది. నా కూతురు, కుమారుడు చాలా చక్కటి పిల్లలు. చాలా మర్యాద, ముక్కుసూటిగా ఉంటారు. మమ్మల్ని ఇప్పుడు సంతోషంలో ఉంచాలని కోరుకుంటారు అని జాకీ ష్రాఫ్ తెలిపారు.

    English summary
    Jackie Shroff reveals How he become bankruptcy in the business. and How his Son Tiger Shroff's got back his properties and house. he showered praises on Tiger shroff love and sacrifices.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X