For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘అఖండ’ ఈవెంట్‌కు ఇద్దరు హీరోలు: ఎన్టీఆర్‌తో పాటు బాలయ్య అభిమాని కూడా.. ఇక రచ్చ రచ్చే

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందుకే ఆయా హీరోలు, దర్శకుల కలయిక కోసం ఫ్యాన్స్‌తో పాటు సామాన్య సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వాటిలో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. దీనికి కారణం గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన రెండు చిత్రాలూ సూపర్ డూపర్ హిట్ అవడమే. ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారు.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చేయబోతున్నారు. దీనికి ఇద్దరు హీరోలు గెస్టులుగా వస్తున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

  హ్యాట్రిక్ కొట్టేందుకు ‘అఖండ'గా

  హ్యాట్రిక్ కొట్టేందుకు ‘అఖండ'గా

  'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రమే 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇది డిసెంబర్ 2న రిలీజ్ కానుంది.

  లవర్‌తో కలిసున్న ఫొటో లీక్ చేసిన శృతి హాసన్: అతడు అడగ్గానే అంత పని చేసేసిన బ్యూటీ

  ఎన్నో సాహసాలు చేసిన బాలకృష్ణ

  ఎన్నో సాహసాలు చేసిన బాలకృష్ణ

  చాలా రోజులుగా హిట్ కోసం పరితపిస్తోన్న బాలయ్య.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం 'అఖండ' మూవీలో ఆయన ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా మారారు. అలాగే, ఈ సినిమాలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

  రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టేసి

  రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టేసి

  క్రేజీ కాంబోలో వస్తున్న 'అఖండ' మూవీ నుంచి ఆ మధ్య టైటిల్ రోర్ వీడియో వచ్చింది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. తద్వారా సీనియర్ హీరోల చిత్రాల్లో దక్షిణ భారతదేశంలోనే టాప్‌కు చేరుకుంది. ఇక, ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా భారీ స్పందనను దక్కించుకుంది.

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

  బిజినెస్‌లోనూ రికార్డులు నమోదు

  బిజినెస్‌లోనూ రికార్డులు నమోదు

  మొదట్లో 'అఖండ' మూవీపై పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు చాలా మంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. మొత్తంగా బాలయ్య కెరీర్‌లోనే భారీ బిజినెస్‌ను జరుపుకుందీ మూవీ.

  గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్

  గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్


  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న 'అఖండ' మూవీని డిసెంబర్ 2న ప్రేక్షకులు ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయబోతున్నారు. ఇక, ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్లాన్లు చేస్తున్నారు. దీన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించాలని చూస్తున్నారు. నవంబర్ చివరి వారంలో ఈ ఫంక్షన్ జరగనుందని తెలిసింది.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం

  ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రాక

  ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రాక

  హైదరాబాద్‌లో నిర్వహించబోతున్న 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి వారి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడు విదేశీ పర్యటనకు వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చాక ఈ ఈవెంట్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. దీంతో ఈ వేడుక కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

  Recommended Video

  అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
  మరో హీరో కూడా రాబోతున్నాడు

  మరో హీరో కూడా రాబోతున్నాడు


  'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌తో పాటు మరో హీరో కూడా రాబోతున్నాడట. అతడే నేచురల్ స్టార్ నాని. అవును.. గతంలో ఓ సినిమాలో బాలయ్య అభిమానిగా నటించిన అతడు.. ఇటీవలే 'అన్‌స్టాపబుల్' షోకు కూడా వచ్చాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య బంధం బలపడింది. ఈ కారణంగానే 'అఖండ' ఈవెంట్‌కు అతడు రాబోతున్నాడనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda Movie Under Boyapati Srinu Direction. Jr NTR and Nani to Attend This Movie Pre Release Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X