For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR30: కొరటాల శివకు మరో కండిషన్ పెట్టిన తారక్?

  |

  జూనియర్ ఎన్టీఆర్ మెల్లగా తన పాన్ మార్కెట్ ను విస్తరించుకునేందుకు.ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరైనా సరే హీరో లు ఒక్కసారి పాన్ ఇండియా సినిమా చేస్తే మళ్లీ అదే తరహాలో మార్కెట్ ను పెంచుకునేందుకు పెద్ద దర్శకులను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ తేజ్ కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమాత్రం పాన్ ఇండియా మార్కెట్ ను మిస్ చేసుకోవద్దని చాలా కఠినమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

  ముఖ్యంగా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదట. సాధారణంగా ఎన్టీఆర్ ఒకసారి సినిమా చేయడానికి ఒప్పుకుంటే మధ్యమధ్యలో దర్శకులతో అనేక విషయాలపై చర్చలు జరిపి అవసరమైతే వాటిని మార్పులు చేసేందుకు కూడా సలహాలు ఇస్తూ ఉంటాడు. వీలైనంతవరకు దర్శకుడికి రచయితలకు ఎన్టీఆర్ తన ఆలోచనా విధానాన్ని ఉపయోగపడేలానే చెప్తాడు. దర్శకులు కూడా ఎన్టీఆర్ టాలెంట్ గురించి తెలుసు కాబట్టి అతని మాటలకు ఆలోచిస్తారు కూడా. జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత తప్పకుండా ఆలిండియా లెవల్లో తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకుంటాడని అర్థమవుతోంది.

  Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)

  Jr ntr another condition to koratala siva for pan india market

  కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా తారక్ ఎలాగైనా ఆ సినిమాతో సోలోగా బాక్సాఫీసు కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ లోకల్ కథను కూడా కొంత అనుమానంతో పక్కకు పెట్టవలసి వచ్చింది. త్రివిక్రమ్ కు నచ్చజెప్పి కొరటాల శివతో కొత్త ప్రాజెక్టును తీసుకువచ్చిన తారక్ ఆ సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టు కథను సెట్ చేసే క్రమంలో ఎన్టీఆర్ కొన్ని సలహాలు ఇస్తున్నారట. ఇప్పటికే కథను పూర్తి చేసిన కొరటాల శివ ఈ సెకండాఫ్ లో మాత్రం కొన్ని చెంజెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎన్టీఆర్ చెప్పడం వల్లనే చాలా మార్పులు చేర్పులు చేస్తున్నాడట. అవన్నీ తప్పకుండా మార్చాలని కండిషన్ పెట్టాల్సి వచ్చిందట.

  హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన అనసూయ భరద్వాజ్: అదిరిపోయే ఫోజులతో అందాల విందు

  సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని అర్థమవుతోంది. ఇక సినిమాలో హీరోయిన్ విషయంలో కూడా ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యాయి. కొరటాలశివ ఆచార్య సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ సినిమాను చాలా తొందరగా ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నాడు. మరి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

  చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి: మెగాస్టార్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకుని మరీ రచ్చ చేసేశాడుగా!

  ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ RRR పనులన్నింటినీ దాదాపు పూర్తి చేసుకున్నాడు. ఆ సినిమాలో కొమరం భీమ్ గా నటించిన తారక్ మొదటిసారి రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది అలాగే ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే మరొక కొత్త ప్రాజెక్టుపై కూడా ఎన్టీఆర్ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  English summary
  Jr ntr another condition to koratala siva for pan india market.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X