twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్ల పోరు..' మెగా vs నందమూరి గురించి ఎన్టీఆర్ సంచలన కామెంట్స్

    |

    రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం అదేనండీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ వేగవంతం అయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ ఇప్పటికే బాలీవుడ్ లో ప్రీ రిలీజ్ వేడుక ను గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. ఇక రక రకాల టీవీ షోలు, ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

     పోటాపోటీగా

    పోటాపోటీగా

    ఒకరకంగా తెలుగులో ఒకప్పుడు పోటాపోటీగా ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు వచ్చేవి. వారి తరం తర్వాత తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ మధ్య ప్రధాన పోటీ ఉండేది. నాగార్జున, వెంకటేష్ ఉండేవారు కానీ ముఖ్యంగా పోటీ మాత్రం చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ ఉండేది. అయితే ఒక రకంగా నందమూరి vs మెగా ఫ్యామిలీ అన్నట్టు ఉండేది. అయితే అప్పట్లో తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి కానీ ఆ తర్వాత బాగా తగ్గాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆ ట్రెండ్ మళ్ళీ మొదలయింది. మంచి మార్కెట్ ఏర్పడుతూ ఉన్న నేపథ్యంలో స్టార్ డైరెక్టర్లు, హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

    అన్ని ప్రాంతాలకు తిరుగుతూ

    అన్ని ప్రాంతాలకు తిరుగుతూ

    ఇక అలాగే మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫైనల్ గా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లను ఒకే తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇక పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని ప్రాంతాలకు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు.

    ఆసక్తికర వ్యాఖ్య

    ఆసక్తికర వ్యాఖ్య

    ఇప్పటికే బాలీవుడ్ లో జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్ కపిల్ శర్మ షో, బిగ్ బాస్ షో ఇలా ఏ ఒక్కటి వదలడం లేదు. వీలైనంత ఎక్కువగా సినిమా జనాలకు రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందా ? అనే ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోరు

    రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోరు

    ఇది ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ.. మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా పోరు నడుస్తోందని.. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ అనబడే మేము మంచి స్నేహితులమని.. మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటుందని అన్నారు ఎన్టీఆర్. మన దేశంలో ఎంతోమంది గొప్ప నటీనటులు ఉన్నారని.. 'ఆర్ఆర్ఆర్' తరువాత అందరూ ఒకే తాటిమీదకు వస్తారని ఆయన అన్నారు.

    భారీ మల్టీస్టారర్ సినిమాలు

    భారీ మల్టీస్టారర్ సినిమాలు


    ఇక భవిష్యతులో భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మొత్తం మీద ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. చూడాలి మరి నిజంగా భవిష్యతులో భారీ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయో లేదో?

    English summary
    Jr NTR Comments on Nandamuri vs mega family rivalry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X