Jr NTR Health update: యంగ్ టైగర్ ఆరోగ్యం గురించి సన్నిహితుల సమాచారం ఏమిటంటే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం అభిమానులు, స్నేహితులు, సన్నిహితుల భావోద్వేగాల మధ్య సాగిపోయింది. తన ఆరోగ్యమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యం సరిగా లేని కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ సూచించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం గురించి సన్నిహితులు వెల్లడించిన సమచారం ఏమిటంటే..

జన్మదినానికి కొద్ది రోజుల ముందు..

జన్మదినానికి కొద్ది రోజుల ముందు..

తన జన్మదినానికి కొద్ది రోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ కరోనావైరస్ బారిన పడ్డారు. తనకు పాజిటివ్ అని తేలడంతో యంగ్ టైగర్ స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. పూర్తిగా విశ్రాంతి తీసుకొంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నారు.

బాధితులకు సహాయం చేస్తూ...

బాధితులకు సహాయం చేస్తూ...


కోవిడ్ పాజిటివ్ సమయంలో తన బర్త్ డే రావడంతో అభిమానులకు ఎన్టీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బాటాలు, హంగామాకు దూరంగా ఉండాలి. వీలైతే కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ, లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు, బాధితులకు సహాయం చేయాలని సూచించినట్టు సమాచారం.

బర్త్ డే వేడుకలకు దూరంగా

బర్త్ డే వేడుకలకు దూరంగా

కోవిడ్ కారణంగా క్వారంటైన్‌లో ఉన్న ఎన్టీఆర్ కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. కుటుంబ సభ్యులకు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వైద్య చికిత్సను పొందుతున్నారు. అయితే కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొన్నారని, క్వారంటైన్ గడువు పూర్తి కాగానే మళ్లీ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్టీఆర్ సన్నిహితులు తెలిపారు.

పూర్తిస్థాయిలో కోలుకొంటున్నారు అంటూ

పూర్తిస్థాయిలో కోలుకొంటున్నారు అంటూ


జూ ఎన్టీఆర్ సన్నిహితులు తెలిపిన ప్రకారం.. యంగ్ టైగర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకొంటున్నారు. కాకపోతే కరోనాకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఆ సమస్యలను కూడా అధిగమించే అవకాశం ఉంది. డాక్టర్ల సూచనలు, సలహాలు పాటిస్తున్నారు. త్వరలోనే అభిమానులకు మంచి వార్త చెబుతారు అంటూ వారు పేర్కొన్నారు.

Recommended Video

Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
Get well soon sir అంటూ ట్వీట్స్

Get well soon sir అంటూ ట్వీట్స్

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విషెస్‌తోపాటు Get well soon sir అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. త్వరగా కోలుకొవాలని భగవంతుడిని ప్రార్థించారు. RRR యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌తో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X