twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబు ఇష్యూపై నోరు విప్పిన ఎన్టీఅర్.. వీడియో రిలీజ్ చేసి దణ్ణం పెడుతూ.. ఇది వార్నింగ్ కాదని!

    |

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని కించపరిచే విధంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేల కొంత మంది మాట్లాడటంతో మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతుండగా నందమూరి బాలకృష్ణ సైతం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయం ఖండించారు. తాజాగా ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

    పెను దుమారం

    పెను దుమారం

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు మీద ఆయన కుటుంబ సభ్యుల మీద అధికార వైసీపీ ఎమ్మెల్యేలు కొంత మంది నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడటం చర్చనీయాంశమైంది.. నారా లోకేష్ పుట్టుక గురించి కొంతమంది మాట్లాడితే మిగతా వాళ్ళు వేరే వ్యక్తుల పేర్లు చెబుతూ చంద్రబాబు సతీమణి పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శలు చేశారు. మునుపెన్నడూ ఇలాంటి విమర్శలు నేరుగా విన్న దాఖలాలు లేక పోవడంతో ఇలాంటి విమర్శలు విన్న వెంటనే చంద్రబాబు కన్నీటిపర్యంతమయ్యారు

    శపధం చేసి

    శపధం చేసి

    అప్పటికప్పుడు తాను అసెంబ్లీకి ఇక మీదట రాను అని మళ్లీ గెలిచిన తర్వాత సీఎంగా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ శపధం చేసిన ఆయన అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ వాకౌట్ చేసిన అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి జాతీయస్థాయిలో నేతలందరికీ ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి అలా కన్నీటి పర్యంతం అవ్వడంతో ఆయనను ద్వేషించేవారు సైతం ఇది కరెక్ట్ కాదు అని అభిప్రాయపడుతున్నారు. తమ ఆడపడుచు విషయంలో జరిగిన విషయాన్ని నందమూరి కుటుంబం ఇప్పటికే మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఖండించిం

    వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు

    వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు

    ఇప్పటివరకు ఎన్టీఆర్ ఈ విషయం మీరు స్పందించలేదు అని విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. రెండు నిమిషాల 19 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ఈ విషయం మీద ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాట మన వ్యక్తిత్వానికి నిదర్శనం అని పేర్కొన్న ఎన్టీఆర్, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణమని అయితే ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు అని అన్నారు.

     మన రక్తంలో ఇమిడి పోయి

    మన రక్తంలో ఇమిడి పోయి

    నిన్న అసెంబ్లీలో అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన తన మనసుని కలచి వేసిందని ఆయన అన్నారు. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా ఆడపడుచులు గురించి గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందని అన్నారు. స్త్రీ జాతిని గౌరవించటం అనేది ఆడవాళ్లను ఆడ జాతిని గౌరవించటం అనేది మన సంస్కృతి, మన జవజీవాలలో మన రక్తంలో ఇమిడి పోయి ఉన్న మన సంప్రదాయం అని ఆయన అన్నారు.

    పౌరుడిగా మాట్లాడుతున్నా

    పౌరుడిగా మాట్లాడుతున్నా

    సంప్రదాయాలను రాబోయే తరాలకు జాగ్రత్తగా భద్రంగా చెప్పాలంటే, మన సంస్కృతిని కలిచివేసి, కాల్చేసి, రాబోయే తరాలకు ఒక బంగారు బాట వేస్తున్నాము అనుకుంటే అది మన మూర్ఖత్వమే. అలా అనుకుంటే మనం చేసేది చాలా పెద్ద తప్పు అని ఆయన అన్నారు. ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణలకు గురైన కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదు అని ఈ మాటలు నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను అని ఆయన అన్నారు.

    మనసారా కోరుకుంటూ

    రాజకీయ నాయకులు అందరికీ ఒకటే విన్నపం అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దయచేసి ఈ అరాచక సంస్కృతి ఇక్కడితో ఆపేయండి అని సమస్యల మీద పోరాడాలని కోరిన ఎన్టీఆర్ రాబోయే తరానికి బంగారు బాట వేసే గారు మనం జాగ్రత్త పడాలి అని అన్నారు. ఇది తన విన్నపం మాత్రమే అని పేర్కొన్న ఎన్టీఆర్, ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని అన్నారు. ఇదే విషయం మీద నందమూరి కళ్యాణ్ రామ్ కూడా స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా ఆయనకు సుదీర్ఘ నోట్ పంచుకున్నారు.

     కళ్యాణ్ రామ్ కూడా

    కళ్యాణ్ రామ్ కూడా

    అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది ఎంతో బాధాకరం. ఇది సరైన విధానం కాదు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలని మనవి చేసుకుంటున్నానని ఆయన అన్నారు. పూజ్యలు తాతగారు రామా రావు గారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుందామని ఆయన అన్నారు.

    English summary
    Jr NTR Responds To Chandrababu Tearful Crying
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X