twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR 30: కొరటాల శివ జెట్ స్పీడ్ ప్లాన్.. రిలీజ్ డేట్ కోసం టార్గెట్ ఫిక్స్!

    |

    జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నాడు. అయితే ఇంతలోపే కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా మళ్లీ ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది. రిస్కు చేయకుండా స్క్రిప్ట్ విషయంలో మరోసారి చర్చలు జరపాలి అని ఎన్టీఆర్ నమ్మకం వచ్చేంతవరకు కూడా షూటింగ్ మొదలు పెట్టాలని అనుకోలేదు.

    ఆ తర్వాత ప్రాజెక్టులో ఎన్నో మార్పులు జరిగాయి. ఇక మొత్తానికి ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టడానికి కొరటాల శివ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. పూర్తిస్థాయిలో బౌండెట్ స్క్రిప్ట్ అయితే రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల కెమెరామెన్ రత్నవేలుతో అలాగే ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తో కలిసి చర్చలు జరిపిన ఫోటోలను కూడా విడుదల చేశారు. ఇక ఈ ప్రాజెక్టును త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు ఎన్టీఆర్ ఆర్ట్స్ రెడీ అవుతోంది.

    Jr ntr upcoming movie NTR 30 shooting plan and release date

    అయితే కొరటాల శివ ప్లాన్ ప్రకారం ఈ సినిమా విడుదలపై కూడా ఒక టార్గెట్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సినిమా షూటింగ్ ఏడాది చివర్లో మొదలైనా అలాగే వచ్చే ఏడాది మొదట్లో మొదలైన కూడా కేవలం 7 నెలల్లోనే ఫినిష్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే 2023 జూలై నెలలోనే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అవ్వాలని అనుకుంటున్నారు. లేకపోతే ఆగస్టులో అయినా పూర్తిస్థాయిలో సినిమా రెడీ అవ్వాలని ఆలోచనతో వెళ్లబోతున్నారు.

    ఇక ఫైనల్ గా సినిమాను 2023 దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కూడా అనుకుంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఈ ప్లాన్ తో వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి షూటింగ్ మొదలుపెడితే మధ్యలో పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరినట్లు సమాచారం. ప్రముఖ తారాగణం కూడా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో లేదో చూడాలి.

    English summary
    Jr ntr upcoming movie NTR 30 shooting plan and release date
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X