Devil First Look: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్.. డెవిల్ లుక్ మామూలుగా లేదు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి బాక్సాఫీస్ హిట్టు కోసం పరితపిస్తున్న హీరోలలో కళ్యాణ్ రామ్ ఒకరు. ప్రయోగాలు బాగానే చేస్తున్నాడు గాని అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇక ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఇప్పుడు నెవ్వర్ బిఫోర్ అనే స్టోరీలతో రాబోతున్నాడు. ఇక రీసెంట్ గా డెవిల్ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా వదిలాడు.
కళ్యాణ్ రామ్ బింబిసార అనే ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. కళ్యాణ్ రామ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇక ఇప్పుడు బ్రిటిష్ ఏజెంట్ గా మరొక కొత్త లుక్కుతో షాక్ ఇవ్వబోతున్నారు. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్ట్ర్ నేషనల్ వైస్ గా ట్రెండ్ అయ్యింది. చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఈసారి వెంటవెంటనే బాక్సాఫీస్ హిట్స్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.

నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. 1945 బ్రిటిష్ కాలం నాటి ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకొని సినిమా కథను సెట్ చేసుకున్నారట. కళ్యాణ్ రామ్ లుక్ చూస్తుంటే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఓ వర్గం ప్రేక్షకులలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మరి సినిమా విడుదల అనంతరం ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. ఇక కళ్యాణ్ రామ్ లైనప్ లో మరో మూడు సినిమాలు కూడా ఉన్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే కాకుండా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో అలాగే మైత్రి మూవీస్ లో కూడా సినిమాలు చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











