Just In
- 24 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక సిగరెట్ ఉంటే ఇవ్వు: జైల్లో తోటి ఖైదీలను బ్రతిమాడుతున్న హీరో!
జిమ్ ట్రైనర్ మీద దాడి చేసిన కన్నడ నటుడు దునియా విజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే తాను అరెస్టయిన వెంటనే బెయిల్ వస్తుందని భావించిన విజయ్ అంచనాలు తలక్రిందులయ్యాయి. బెయిల్ దొరకక పోవడంతో జైల్లో అల్లాడి పోతున్నాడు. బెయిల్ పిటీషన్ మీద జరుగుతున్న విచారణ బుధవారం వరకు వాయిదా వేయడంతో మంగళవారం కూడా ఆయన జైల్లోనే గడపాల్సిన పరిస్థితి.
పొగత్రాగే అలవాటు ఉన్న విజయ్... జైల్లో సిగరెట్ దొరకక అల్లాడిపోతున్నాడట. జైలు సిబ్బందిని సిగరెట్ కావాలని అడిగాడని... అలాంటివి ఇక్కడ కుదరవని వారు తేల్చి చెప్పడంతో తోటి ఖైదీలెవరిదగ్గరైనా సిగరెట్ దొరుకుతుందేమో అని వారిని బ్రతిమాడినట్లు సమాచారం. మంగళవారం ఉదయం ఆయనకు పులిహోర, టీ అందించినట్లు పోలీసులు తెలిపారు.

కన్నడలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న దునియా విజయ్ జిమ్ ట్రైనర్‌ను కిడ్నాప్ చేసిన వేధింపులకు గురి చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. మారుతి గౌడ అనే జిమ్ ట్రైనర్‌ను కారులో కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు విజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
విజయ్‌పై ఐపీసి సెక్షన్ 365(కిడ్నాపింగ్), 342, 325, 506 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం. ఒక సినిమా హీరో ఇలాంటి చర్యలకు పాల్పడటం బెంగుళూరు చర్చనీయాంశం అయింది. అరెస్ట్ అనంతరం విజయ్‌ను 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపించారు.