For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rishab Shetty: తిరుపతిలో రిషబ్ శెట్టి సందడి.. 'కాంతార' సీక్వెల్ పై క్లారిటీ?

  |

  ఒక చిన్న సినిమాగా కన్నడ భాషలో విడుదలై ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది కాంతార. ముందుగా కన్నడలో రిలీజైనప్పటికీ ప్రస్తుతం ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యశ్ నటించిన కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన హోంబలే ఫిలీంస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీంతో మరోసారి హోంబలే ఫీలింస్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు హీరోగా, డైరెక్టర్ గా మెస్మరైజ్ చేశాడు రిషబ్ శెట్టి. క్లైమాక్స్ చివరిలో తన నట విశ్వరూపం చూపించి ప్రేక్షకులను ఫిదా చేశాడు. తెలుగులో విడుదలైన ఈ కాంతార చిత్రం కలెక్షన్ల పరంపర కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి తాజాగా తిరుపతిలో సందడి చేశాడు.

  అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లతో..

  అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లతో..

  కన్నడ చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసిన కాంతార సినిమా ప్రస్తుతం తెలుగు, హిందీలోనూ అదరగొడుతోంది. కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కర్ణాటకలో సెప్టెంబర్ 30న విడుదలైంది. అతి తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో 15 రోజుల తర్వాత ఇతర భాషల్లోకి (తెలుగు, హిందీ, తమిళం) డబ్ చేసి విడుదల చేశారు. అయితే కాంతార తెలుగు వెర్షన్ కేవలం 13 రోజుల్లోనే రూ. 45 కోట్లు గ్రాస్ కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. నెల రోజులు దాటకముందే అన్ని భాషల్లో అత్యధిక వసూళ్లతో రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది. కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నిర్మాతగా విజయ్ కిరంగదూర్ వ్యవహరించారు.

   తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ కు..

  తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ కు..

  కన్నడ నాట 'కాంతార' సూపర్ సక్సెస్ కావడంతో దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకుంటున్న నేపథ్యంలో తాజాగా హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తిరుపతిలో సందడి చేశారు. తిరుపతిలోని జయశ్యామ్ థియేటర్ కు వెళ్లగా.. థియేటర్ యజమానులు, అభిమానులు భారీ పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. రిషబ్ శెట్టి రాకతో థియేటర్ మొత్తం అరుపులు, విజిల్స్ తో మారుమోగిపోయింది. ఆయనతో ఫొటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం కనబరిచారు.

  కాంతార చిత్రంలాగే ఉండాలని..

  కాంతార చిత్రంలాగే ఉండాలని..


  రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ''భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాంతార చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశాం. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం భారతీయుందరి బాధ్యత. ఈ సినిమాలో వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రయత్నించాం. ఇప్పటివరకూ ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించలేదు. కానీ నా తర్వాత సినిమా కూడా కాంతార చిత్రంలాగే ఉండాలని ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాను ఎంతగానో ఆదరించారు. మీ అందరికీ కృతజ్ఞతలు'' అని తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాను నిర్మించిన విజయ్ కిరంగదూర్.. కాంతారా హిట్ కావడంతో సీక్వెల్ కూడా రూపొందిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కావండతోనే సీక్వెల్ గా తీశారని ఉదాహరణగా చెబుతున్నారని సమాచారం.

  English summary
  Kantara Movie Hero And Director Rishab Shetty In Tirupati Jayasyam Theater And Reveals About His New Project
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X