For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఏం పీకుతున్నారని రకుల్ మెసేజ్ గమనించా, ఆవిడే రైట్ అనిపించింది: కార్తి

  |

  కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'దేవ్'. ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

  ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ...ఒక్కో జనరేషన్ ఆలోచన ఒక్కోలా ఉంటుంది. ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. ఫ్రెండ్షిప్ ఉంటుంది. మోస్ట్ ఛాలెంజింగ్ లవ్ ఉంది. ఐదేళ్ల క్రితం తీసుకుంటే అమ్మాయిలను కలవడం అంటే కాలేజీలోనో, బస్ స్టాప్‌లోనో కలిసేవారం. ఇపుడు ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో న్యూయార్కులో ఉన్న అమ్మాయిని కూడా కలవొచ్చు. ఈ జనరేషన్‌ ఆలోచనలకు దగ్గరగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.

  ఇపుడు అవన్నీ కామన్

  ఇపుడు అవన్నీ కామన్

  లవ్ అనేది కూడా ఒక అడ్వెంచర్ లాంటిదే. యువతరం ఈ కథకు కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఇపుడు సింగిల్ పేరెంటింగ్, బ్రోకెన్ మ్యారేజెస్ కామన్ అయిపోయాయి. బ్రేకప్స్ ఈజీ అయిపోయాయి. ఈ జనరేషన్ ఫ్రెండ్షిప్, లవ్ విషయాల్లో ఎలా ఆలోచిస్తారు అనేది ఈ సినిమా చెబుతుంది. సినిమా మొత్తాన్ని స్టైలిష్‌గా చేయాలనుకున్నాం. కథ వినగానే వెంటనే బిఎండబ్ల్యు బైక్ బుక్ చేశామని కార్తి తెలిపారు.

  ఏం పీకుతున్నారని రకుల్ మెసేజ్ గమనించా, ఆవిడే రైట్ అనిపించింది

  ఏం పీకుతున్నారని రకుల్ మెసేజ్ గమనించా, ఆవిడే రైట్ అనిపించింది

  ఖాకీ సినిమా షూటింగ్ జరిగేపుడు రకుల్ ఎప్పుడూ వాయిస్ మెసేజ్ పెడుతుండేది. ఇది జరుగలేదు, అది జరుగలేదు, ఏం పీకుతున్నారు అని సందేశాలు పంపేది. బిజినెస్ ఉమెన్ క్యారెక్టర్‌కు రకుల్ పర్ఫెక్టుగా సెట్టవుతుంది అని అప్పుడే అనిపించిందని కార్తి తెలిపారు.

  ఇద్దరివీ డిఫరెంట్ క్యారెక్టర్స్

  ఇద్దరివీ డిఫరెంట్ క్యారెక్టర్స్

  నా క్యారెక్టర్ ఒక ట్రావెలర్. అతడికి అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం లేదు. అతడిని కూడా భయపెట్టే స్థాయిలో హీరోయిన్ పాత్రను డిజైన్ చేశారు. లవ్ స్టోరీ కాబట్టి ఇద్దరికీ సమానమైన ప్రధాన్యత ఉంటుంది. నా క్యారెక్టర్‌కు డబ్బు అంటే అంత మఖ్యం కాదు, ఆమె క్యారెక్టర్‌కు డబ్బు అంటే చాలా ఇంపార్టెంట్.

  భిన్నమైన చిత్రం

  భిన్నమైన చిత్రం

  ఈ జనరేషన్లో రెండు భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది. ఖాకీ, చినబాబు తర్వాత నేను చేస్తున్న పూర్తి డిఫరెంట్ మూవీ.. అని కార్తి తెలిపారు.

  దేవ్

  దేవ్

  'దేవ్'లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నిక్కీ గల్రానీ సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ 'దేవ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జైరాజ్, సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్రాజ్, ఆర్ట్: రాజీవన్, ఎడిటర్: రుబెన్, నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు, దర్శకత్వం: రజత్ రవిశంకర్.

  English summary
  Karthi Lovely Speech at Dev Pre Release Event. Hero Karthi’s upcoming movie ‘DEV’ is going to release on February 14th, on the occasion of Valentine’s Day. Harris Jayaraj has composed music for the film. This is an action family drama being written and directed by Rajath Ravishankar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more