Karthikeya 2 నిఖిల్ సిద్దార్థ్‌ను సత్కరించిన నూజెర్సీ మేయర్..
థియేట్రికల్ రిలీజ్‌తో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కార్తికేయ 2 చిత్రం OTT ఫ్లాట్‌ఫాంపై సంచలనం సృష్టిస్తున్నది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన కార్తికేయ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సాధించి.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

కార్తీకేయ 2 సినిమా అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకొన్నది. ఇస్కాన్ లేఖ, గుజరాత్ సీఎం, అమితాబ్ బచ్చన్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, పలువురు కార్తికేయ టీమ్‌ను అభినందించారు.
తాజాగా న్యూజెర్సీ ఎడిసన్ మేయర్ శ్రీ సామ్ జోషి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లో కార్తికేయ 2 అపారమైన విజయం సాధించినందుకు నిఖిల్ సిద్ధార్థను సత్కరించారు. అతను నిఖిల్ గురించి కొన్ని మాటలను పంచుకున్నాడు "అందరికీ నమస్కారం, మేము నిఖిల్‌ని చిత్ర పరిశ్రమలో అతని అద్భుతమైన పనిని గుర్తించాలని కోరుకున్నాం. కార్తికేయ 2 అమెరికాలో భారత దేశంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. మేము అతని గురించి చాలా గర్వపడుతున్నాం. మేయర్ కార్యాలయం ద్వారా అతనికి ఒక ప్రకటన జారీ చేయాలనుకుంటున్నాం. మీరు నటనపట్ల అంకిత భావాన్ని విలక్షతను చాటినందుకు ధన్యవాదాలు అని లేఖలో పేర్కొన్నారు.
యూఎస్‌లోని నూజెర్సీ మేయర్ చూపించిన ప్రేమ, గౌరవానికి చాలా ధన్యవాదాలు సార్. ఎడిసన్ మేయర్ సామ్ జోషి ప్రశంసలతో ఆనందంలో మునిగిపోయింది అని నిఖిల్ స్పందించాడు.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన అడ్వెంచర్ డ్రామా కార్తీకేయ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కార్తికేయ 2 చందూ మొండేటి 2014లో రూపొందించిన కార్తికేయకు సీక్వెల్‌గా కార్తీకేయ 2 రూపొందింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ కథ మునిగిపోయిన ద్వారక నగరం యొక్క దాగి ఉన్న లోతును వివరిస్తుంది.


Click it and Unblock the Notifications











