చిరంజీవి నా పెళ్లికి వస్తాడు.. చిన్నప్పుడే చెప్పిన కార్తికేయ... చిరుని టాగ్ చేస్తూ ఆసక్తికర ట్వీట్

యువ హీరో, 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడన్న సంగతి తెలిసిందే. ఆయన తన ప్రియురాలు లోహిత మెడలో మూడు ముళ్లు వేశారు. ఆయన వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడంతో పెళ్లి మండపం లో కొత్త కళ నెలకొంది. అయితే చిరంజీవి తన పెళ్ళికి హాజరు కావడం మీద కార్తికేయ ఆసక్తికరంగా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే

 ఆదివారం నాడు

ఆదివారం నాడు

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఆదివారం ఉదయం హైదరాబాద్‌ లోని ఓ కళ్యాణ వేదికలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌ పుత్‌ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కాలేజ్ లవ్

కాలేజ్ లవ్

వరంగల్ నీట్‌ లో బీటెక్‌ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసిందట. ఈ విషయాన్ని కార్తికేయ స్వయంగా వెల్లడించారు..అయితే చదువు తర్వాత హీరోగా రాణించాలనే ఉద్దేశంతో కార్తికేయ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ముందు ప్రేమతో మీ కార్తిక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది వర్కౌట్ కాలేదు. కానీ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్‌ ఎక్స్‌ 100'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

అలా క్రేజ్

అలా క్రేజ్

ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే వరుస సినిమా అవకాశాలు వస్తున్నా సరే అన్నిటికీ టెంప్ట్ కాకుండా విభిన్నమైన సినిమాలనే ఎంచుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన 'రాజా విక్రమార్క' రిలీజ్ అయింది. మరో పక్క తమిళ స్టార్ హీరో అజిత్‌ హీరోగా నటించిన 'వలిమై' చిత్రంలో కార్తికేయ నెగటివ్ రోల్‌ పోషించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో

ఇక రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా త‌న‌కు కాబోయే భార్య‌ని స్టేజ్ మీదనే ప‌రిచ‌యం చేసి ఆశ్చర్యపరిచాడు. 'నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నానని వెల్లడించారు, అప్పుడే తనకి నేను హీరో అవుదామని అనుకుంటున్నానని చెప్పి, హీరో అయ్యాక మీ ఇంట్లో వచ్చి అడుగుతా'నని చెప్పానని అలా నేను హీరో అయి చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నానని వెల్లడించారు.

 చిరంజీవి నా పెళ్లికి

చిరంజీవి నా పెళ్లికి

అయితే తన వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం మీద కార్తికేయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను పెద్దయ్యాక హీరో నవ్వుతా నా పెళ్ళికి చిరంజీవి వస్తాడు, అని చిన్నప్పుడు అమాయకంగా చెప్పేవాడిని అని, కానీ తన తల రాత అదే అయ్యి తన పెళ్ళికి చిరంజీవి గారు వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవిని టాగ్ చేస్తూ మీరు నా పెళ్ళికి రావడం చాలా గొప్ప విషయం, ఇది నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే విషయం అని కార్తికేయ ఆనందం వ్యక్తం చేశాడు. చిరంజీవి గురించి కార్తికేయ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Recommended Video

Actor Karthikeya & Tanikella Bharani Interview Part 2

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X