twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి అలా మాట్లాడం ఆశ్చర్యంగా అనిపించింది.. తెలుగు ప్రజలు దేవుళ్లు.. యష్

    |

    కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సినిమా కేజీఎఫ్ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌). రాక్‌ స్టార్ యశ్‌ హీరో. మిస్ దివా శ్రీ‌నిధి శెట్టి క‌థానాయిక‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వ‌హించారు. విజయ్‌ కిరగందూర్ నిర్మించ‌గా, ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి రిలీజ్ చేశారు. హైద‌రాబాద్‌లో స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ కార్యక్రమంలో హీరో యష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి, విజయ్ కిరంగదుర్, ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు.

    కేజీఎఫ్‌కు గొప్ప విజయం

    కేజీఎఫ్‌కు గొప్ప విజయం

    చిత్ర క‌థానాయ‌కుడు యశ్‌ మాట్లాడుతూ.. కె.జి.యఫ్ గొప్ప విజ‌యం సాధించింది. నా నిర్మాత‌ల వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది. ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమా, బిజినెస్‌ సినిమా అవుతుంది అని ముందుగా నమ్మిన వ్యక్తి విజయ్‌ కిరగందుర్‌. తెలుగు లోనూ పెద్ద విజ‌యం సాధించాం. ఇక్క‌డి ప్రజల అభిమానం చూస్తుంటే డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ చెప్పిన `అభిమానులే దేవుళ్ళు` అనే మాట గుర్తుకు వస్తోంది.

     నా తొలి సినిమాకే ఘన స్వాగతం

    నా తొలి సినిమాకే ఘన స్వాగతం

    నా తొలి సినిమాకే ఇంత ఘ‌న స్వాగతం చెప్పిన తెలుగు ప్రజలు నిజ‌మైన‌ దేవుళ్ళు. 10 ఏళ్ల‌ క్రితం ప‌రిశ్ర‌మ‌కు వచ్చినప్పుడు కూడా నాకు ఇలాంటి వెల్‌కమ్‌ చెప్పి ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా నన్ను ప్రేమగా అక్కున చేర్చుకున్నారు. ఈ సినిమాను ముందు నుండి నమ్మి ప్రతీఊరిలో ప్రతి ఇంటికీ తీసుకెళ్లిన అంద‌రికీ నా ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలకి మంచి పంపిణీదారులు అవసరం. ఆ విషయంలో నేను సాయి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని యష్ అన్నారు.

     ఎస్ఎస్ రాజమౌళి వల్లనే

    ఎస్ఎస్ రాజమౌళి వల్లనే

    కె.జి.యఫ్ సినిమాను చూసి బూస్టప్‌ ఇచ్చిన ఎస్‌ఎస్‌ రాజమౌళిగారికి నా ధ‌న్య‌వాదాలు. అంత గొప్ప వ్య‌క్తి నా గురించి అద్భుతంగా మాట్లాడడం నిజంగా నాకు ఆశ్ఛర్యం క‌లిగింది. ఆయన అంచనాలను ఈ సినిమా ఘన విజయం ద్వారా అందుకున్నామని అనుకుంటున్నాం. రామరాజుగారు చాలా హార్డ్‌ వర్కర్‌. ఈ సినిమాకు ఆయన తండ్రి శ్రీ కైకాల సత్యనారాయణగారి పేరును ఇచ్చి చాలా సహాకారం అందించారు. హనుమాన్‌గారు నిజంగా నాలో స్ఫూర్తి నింపిన‌ వ్యక్తి. ఆయన కృషి వల్లనే ఈ సినిమా డబ్బింగ్‌ సినిమాలా కాకుండా స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలా మాటలు అందించారు. ఈ సినిమా కోసం ఆయన ఐదు వెర్షన్స్‌లో డైలాగ్స్‌ రాసి ఇచ్చారు అని యష్ తెలిపారు.

     ప్రశాంత్ నీల్ హాలీవుడ్‌ స్థాయిలో

    ప్రశాంత్ నీల్ హాలీవుడ్‌ స్థాయిలో

    రామజోగయ్య శాస్త్రిగారు ఈ స్క్రిప్ట్‌లో ఇన్‌వాల్వ్‌ అయి పాట‌లు రాశారు. ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది అంటే ఆయన టేకింగ్‌ కారణం. భువన గౌడ గారి ప్రతీ ఫ్రేమ్‌ అద్భుతంగా ఉండి హాలీవుడ్‌ స్థాయిని గుర్తుచేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టి చాలా లక్కీ. ఒకేసారి అయిదు భాషలలో పరిచయం అయింది. తెలుగు హీరోలు చాలా గ్రేట్‌ వాళ్ళ డాన్సులు, ఫైట్స్‌ లకు నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగు హీరోలందరి సినిమాలు చూసి నేను తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను. వాళ్ళే నా స్ఫూర్తి అని యష్ అన్నారు.

     చాలా సంతోషంగా ఉంది

    చాలా సంతోషంగా ఉంది

    క‌థానాయిక‌ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా లో నేను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ గారికి, విజయ్‌, యష్‌కు థాంక్స్‌`` అన్నారు.

    సినిమా హిట్‌ అయినందుకు

    సినిమా హిట్‌ అయినందుకు

    కైకాల రామారావు మాట్లాడుతూ.. సినిమాను ఆదరించిన ప్రతీప్రేక్షకుడికి నా ధ‌న్య‌వాదాలు. సినిమా మంచి హిట్‌ అయినందుకు అభినందనలు`` అన్నారు. మాటల రచయిత హనుమాన్‌ మాట్లాడుతూ - ``స్క్రిప్ట్‌ చూసి తెలుగులో కూడా విడుదల చేస్తే బాగుంటుంది అనుకున్నాను సినిమా తెలుగులో ఇంత పెద్ద హిట్‌ అవుతుంది అనుకోలేదు. ఇలాంటి సినిమాలోభాగం అయినందుకు సంతోషం`` అన్నారు.

    గోల్డెన్‌ ఫిలిమ్‌ అనేలా

    గోల్డెన్‌ ఫిలిమ్‌ అనేలా

    కె.జి.యఫ్‌ అంటే కన్నడ గోల్డెన్‌ ఫిలిమ్‌ అనేలా సినిమా ఉంది. ఈ సంవత్సరానికి బ్రహ్మాండమైన ముగింపు. ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమా అయ్యిందంటే ఆ క్రెడిట్‌ అంతా చిత్ర యూనిట్‌కి దక్కుతుంది. ఈ సినిమాను నేను పూర్తిగా చూసి పాటలు రాయడం జరిగింది. ఈ సినిమాలో అన్ని పాటలు నేనే రాశాను. పాటలు వింటుంటే ఉల్లాసం ఉద్రేకం వస్తున్నాయి. డబ్బింగ్‌ సినిమాకు ఇంత మంచి ఆదరణ నిజంగా ఊహాతీతం. ఈ సినిమా గణ విజయం ద్వారా యష్‌ నటుడిగా ఇంకో మెట్టు పైకి ఎదిగాడు. ఇంత పెద్ద మాన్‌స్టర్‌ హిట్‌ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

    English summary
    KGF: Chapter 1, starring Yash has become the highest grosser in US for a Kannada film with nearly $ 400 K gross. This news is confirmed by trade analyst Kaushik. KGF is directed by Prashanth Neel. Srinidhi Shetty is playing the female lead. The period action film, which is the first Kannada film to have been dubbed in Tamil, Telugu, Malayalam and Hindi languages, is produced by Vijay Kiragandur
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X