Just In
- 4 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
- 4 hrs ago
తెలుగులో భారీగా ఆఫర్లు అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. అఖిల్, బన్నీతో కూడా..
- 5 hrs ago
నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్
- 6 hrs ago
మహానటి దర్శకుడి కోసం మరో కొత్త ప్లాన్ రెడీ చేసుకున్న ప్రభాస్!
Don't Miss!
- News
లాయర్ దంపతుల హత్య: సుందిళ్ల బ్యారేజీలో కత్తులు లభ్యం, భారీ అయస్కాంతాలతో..
- Finance
ఆ ధరతో రూ.10,500 తక్కువ, రూ.46,000 దిగువకు పడిపోయిన బంగారం
- Sports
హార్దిక్ పాండ్యాతో పోటీకి శార్దూల్ ఠాకూర్ సై.. 6 సిక్స్‌లతో వీరవిహారం.. సెంచరీ జస్ట్ మిస్!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Lifestyle
బియ్యం పిండిని ఇలా ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతాల గురించి మీకు తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ది ప్రత్యేకమైన స్థానం అనే చెప్పాలి. దీనికి కారణం అతడు వరుసగా పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తుండడంతో పాటు టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి పంథాను మార్చుకున్న అతడు.. వరుసగా భారీ చిత్రాలనే చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు.. ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేశారు. ఆ సంగతులు మీకోసం!

ఆ రెండు సినిమాలతో పెరిగిన ఫాలోయింగ్
‘బాహుబలి'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి చిత్రం ‘సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశాడు. తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో నిరాశ పరిచిన ఈ మూవీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసి రికార్డులు క్రియేట్ చేసింది.

కెరీర్‌లో తొలిసారి అలాంటి పాత్రలో ప్రభాస్
ప్రస్తుతం ప్రభాస్.. ‘జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్‌తో ‘రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అప్‌డేట్స్ లేవు... నిర్మాణ సంస్థపై ఆగ్రహం
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. దీని నుంచి ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా అప్‌డేట్స్ రావడం లేదు. దీంతో వాళ్లంతా నిరాశగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. ఆ సమయంలో కంగారు పడకండి.. మీ అంచనాలకు తగినట్లు సినిమా ఉంటుందని సముదాయించే ప్రయత్నం చేశారు.

రాధే శ్యామ్ సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు
జనవరి 20 బుధవారం రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఆయన తన నివాసంలో కుటుంబ సభ్యుల నడుమ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఎప్పుడూ ఘనంగా జరుపుకుంటున్నప్పటికీ.. కరోనా జాగ్రత్తల కారణంగా ఈసారి నిరాడంబరంగా చేసుకున్నారు. అనంతరం ఓ న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కృష్ణంరాజు.. ‘రాధే శ్యామ్' సీక్రెట్లు లీక్ చేశారు.

విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన రెబెల్ స్టార్
ప్రభాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్'కు సమర్పకుడిగా ఉన్నారు కృష్ణంరాజు. దీంతో ఈ సినిమా గురించి చానెల్ యాంకర్ ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంలో రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారాయన. ‘సినిమాను గత డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నాం కానీ కోవిడ్ వలన ఆలస్యం అయింది. ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం' అని విడుదల తేదీని చెప్పకనే చెప్పారు రెబెల్ స్టార్.

క్యారెక్టర్స్.. షూటింగ్ అప్‌డేట్ కూడా రివీల్
ఇక, ‘రాధే శ్యామ్'లో తాను నటిస్తున్నట్లు కూడా రివీల్ చేశారు కృష్ణంరాజు. ‘ఇందులో పరమహంస అనే మహాజ్ఞాని, గొప్పవ్యక్తి పాత్రను పోషిస్తున్నాను. దాని కోసమే గడ్డం పెంచి కొత్తగా కనిపిస్తున్నా' అని అన్నారు. అలాగే, షూటింగ్ గురించి చెబుతూ.. ‘ప్రభాస్‌తో కొన్ని సీన్స్ చేయాలి. పాటలు మొత్తం పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడ జరుగుతోంది' అని వివరించారాయన.