Just In
- 51 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- News
viral video: కూతకు వెళ్లిన ఎమ్మెల్యే రోజా: కబడ్డీ ఆడుతూ సందడి
- Finance
పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్, క్యాష్ డిపాజిట్స్, ఉపసంహరణపై కొత్త రూల్స్
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం: భయపెడుతోన్న ఫ్లాప్ సెంటిమెంట్.. రిస్క్ చేస్తున్నాడు!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తోన్న హీరో. ఇక్కడ మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాపైనా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. దీనికి కారణం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడతను. ఇలాంటి పరిస్థితుల్లో ఓ విషయంలో ప్రభాస్ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతడి అభిమానులను ఫ్లాప్ సెంటిమెంట్ కలవరపెడుతోంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!
టాలీవుడ్ రత్తాలు లక్ష్మీ రాయ్ హాట్ బికినీ ఫొటోలు

బాలీవుడ్‌కు స్టామినాను పరిచయం చేశాడు
‘బాహుబలి'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి చిత్రం ‘సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశాడు. తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో నిరాశ పరిచిన ఈ మూవీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసి రికార్డులు క్రియేట్ చేసింది.

కొత్త రోల్‌లో డార్లింగ్... కెరీర్‌లో మొదటిసారి
ప్రస్తుతం ప్రభాస్.. ‘జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్‌తో ‘రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఫ్యాన్స్ నిరాశ.. నిర్మాణ సంస్థపై విమర్శలు
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. దీని నుంచి ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా అప్‌డేట్స్ రావడం లేదు. దీంతో వాళ్లంతా నిరాశగా ఉన్నారు. ఒకానొక సందర్భంలో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. ఆ సమయంలో కంగారు పడకండి.. మీ అంచనాలకు తగినట్లు సినిమా ఉంటుందని సముదాయించే ప్రయత్నం చేశారు.

రివీల్ చేసిన రెబెల్ స్టార్... అన్నీ క్లియర్‌గా
‘రాధే శ్యామ్'లో తాను నటిస్తున్నట్లు ఇటీవలే రివీల్ చేశారు కృష్ణంరాజు. ‘ఇందులో పరమహంస అనే మహాజ్ఞాని, గొప్పవ్యక్తి పాత్రను పోషిస్తున్నాను. దాని కోసమే గడ్డం పెంచి కొత్తగా కనిపిస్తున్నా' అని అన్నారు. అలాగే, షూటింగ్ గురించి చెబుతూ.. ‘ప్రభాస్‌తో కొన్ని సీన్స్ చేయాలి. పాటలు మొత్తం పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడ జరుగుతోంది' అని వివరించారాయన.

ఆ విషయంలో ప్రభాస్ సంచలన నిర్ణయం
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఎన్నో సాహసాలు చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఫైట్స్ లేని సినిమాలో నటించడం.. నీటి అడుగున సీన్ చేయడంతో పాటు ఎన్నో ప్రయోగాలు చేశాడని ప్రచారం జరుగుతోంది. ఇక, తన పెదనాన్న కృష్ణంరాజు విషయంలోనూ యంగ్ రెబెల్ స్టార్ సంచలన నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

భయపెడుతోన్న ప్రభాస్ ఫ్లాప్ సెంటిమెంట్
గతంలో కృష్ణం రాజు - ప్రభాస్ కాంబినేషన్‌లో ‘బిల్లా', ‘రెబెల్' అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండూ ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ‘రాధే శ్యామ్'లో తన పెదనాన్నను నటింపజేస్తున్నాడతను. దీంతో ఇది కూడా ఫ్లాప్ అవుతుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే, ఈ మూవీపై ఉన్న కాన్ఫిడెన్స్‌తోనే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు అంటున్నారు.