For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా ఫ్యాన్స్‌కు షాక్: పాన్ ఇండియా డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమాపై క్లారిటీ.. అందుకే కలిశారట

  |

  టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను దక్కించుకున్న అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇక, అప్పటి నుంచి అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఫలితంగా తన క్రేజ్‌తో పాటు మార్కెట్‌ను భారీగా పెంచుకుంటున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే అతడు లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సదరు దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

  సంచలన విజయాన్ని అందుకుని

  సంచలన విజయాన్ని అందుకుని

  మెగా హీరో రామ్ చరణ్ ఇటీవలే RRR (రౌద్రం రుధిరం రణం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి అతడు చేసిన నటన అందరి ప్రశంసలను అందించింది. అంతేకాదు, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుని రికార్డులు కొట్టేసింది.

  యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

  మెగా మల్టీస్టారర్ మాత్రం డిజాస్టర్‌‌

  మెగా మల్టీస్టారర్ మాత్రం డిజాస్టర్‌‌

  RRR వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రామ్ చరణ్ 'ఆచార్య' అనే సినిమాతో వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీలో అతడు ముఖ్యమైన పాత్రను పోషించాడు. మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి స్పందన దక్కలేదు. దీంతో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

  దిగ్గజ దర్శకుడితో చరణ్ సినిమా

  దిగ్గజ దర్శకుడితో చరణ్ సినిమా

  ప్రస్తుతం రామ్ చరణ్ ఇండియన్ సినీ చరిత్రలోనే దిగ్గజ దర్శకుడిగా పేరొందిన ఎస్ శంకర్‌తో ఓ సినిమాను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూట్ చాలా వరకు పూర్తైంది. దీనికి 'అధికారి', 'సర్కారోడు' టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

  జెర్సీ దర్శకుడితో సినిమా ప్రకటన

  జెర్సీ దర్శకుడితో సినిమా ప్రకటన

  ఇప్పటికే పలు చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. త్వరలోనే జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

  లోకేష్ కనగరాజ్‌తో చరణ్ సినిమా

  లోకేష్ కనగరాజ్‌తో చరణ్ సినిమా

  తమిళంలో 'ఖైదీ', 'మాస్టర్' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి.. ఇప్పుడు కమల్ హాసన్‌తో 'విక్రమ్' అనే పాన్ ఇండియా హిట్‌ను తెరకెక్కించిన లోకేష్ కనగరాజ్‌తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వీళ్లిద్దరూ ఇటీవలే హైదరాబాద్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచి ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

  ఉల్లిపొర లాంటి బట్టల్లో దిశా పటానీ రచ్చ: అవి కూడా కనిపించేలా.. ఆమెనిలా చూస్తే!

  చరణ్‌తో ప్రాజెక్టుపై డైరెక్టర్ క్లారిటీ

  చరణ్‌తో ప్రాజెక్టుపై డైరెక్టర్ క్లారిటీ

  రామ్ చరణ్‌తో లోకేష్ కనగరాజ్ సినిమా చేస్తున్నాడని వస్తున్న వార్తలపై తాజాగా సదరు దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 'రామ్ చరణ్‌తో నేను సినిమా చేస్తున్నాను అన్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటి వరకూ అతడికి నేను ఎలాంటి స్టోరీని వినిపించలేదు. కానీ, ఎప్పటికైనా అతడితో సినిమా మాత్రం చేస్తాను. అది వేరే లెవెల్‌లో ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.

  అందుకే కలిశాం అంటూ స్పష్టత

  అందుకే కలిశాం అంటూ స్పష్టత

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సమావేశం అవడంపై లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ.. 'రామ్ చరణ్‌, నేను చాలా మంచి స్నేహితులం. అందుకే హైదరాబాద్‌లో తనను కలిశాను. ఆ సమయంలో మా మధ్య ఎలాంటి సినిమా చర్చలు జరగలేదు. కేవలం క్యాజువల్‌గానే మేము కలుసుకున్నాం. ఇలా చాలా సార్లు జరిగింది' అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

  English summary
  Recently Kollywood Director Lokesh Kanagaraj Scores Massive Hit with Vikram. Now He Gave Clarity on Ram Chran Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X