twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Dharam Tej పై కేసు నమోదు.. సీసీటీవీ ఫుటేజ్‌పై పోలీసులు సీరియస్‌గా.. ఆ తర్వాతే చర్యలు!

    |

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వార్త సినీ వర్గాలను, అభిమానులను, సాధారణ ప్రజలను కాకుండా తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. వినాయక చవితి పండుగ సంబురాల్లో ఉన్న ఫ్యాన్స్ ఈ వార్తతో ఉలిక్కిపడ్డారు. మెగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. అయితే హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను మాదాపూర్ పోలీసులు విశ్లేషించారు. ఆ ప్రమాదానికి కారణాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. అయితే ఈ ప్రమాద సంఘటనపై మాదాపూర్, రాయదుర్గం పోలీసులు, మీడియా కథనాలు వెల్లడించిన విషయాలు ఇవే...

    ప్రమాదానికి ప్రధాన కారణం ఇదే..

    ప్రమాదానికి ప్రధాన కారణం ఇదే..

    సాయిధరమ్ తేజ్ ప్రమాదం జరిగినప్పుడు 120 కిలో మీటర్ల వేగం కంటే ఎక్కువ స్పీడ్‌లో వాహనాన్ని నడుపుతున్నాడు. అయితే కేవలం సెకన్ల వ్యవధిలోనే 1వ లేన్ నుంచి మూడో లేన్‌కు షిఫ్ట్ అవ్వడం వల్లే బైక్ సాయిధరమ్ చేతిలో నుంచి అదుపు తప్పింది. దానిని కంట్రోల్ చేయలేక ఎడమవైపు పడిపోయాడు. ఆ తర్వాత కొన్ని మీటర్ల దూరం వాహనం అతడిని ఈడ్చుకొంటూ వెళ్లడంతో ఎడమ కంటికి, ఛాతికి ఎడమవైపు, కడుపులో గాయాలైనట్టు ప్రాథమికంగా వైద్యులు వెల్లడించారు.

    రోడ్డుపై ఇసుక పేరుకపోవడంతో

    రోడ్డుపై ఇసుక పేరుకపోవడంతో

    తాజాగా రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో సాయిధరమ్ తేజ్ మితీమీరిన వేగంతో వెళ్లడం స్పష్టంగా కనిపించింది. వర్షాల కారణంగా రోడ్డుపై పేరుకపోయిన ఇసుక కారణంగా బైక్ స్కిడ్ అయింది. ప్రమాదం జరిగినప్పుడు సాయిధరమ్ వాహనానికి ముందు మరో వాహనం, ఆటో వెళ్తున్నది. అయితే సాయిధరమ్ తేజ్ బైక్ వెంట్రుక వాసి దూరంలో ఉండటం వల్ల ఇతర వాహనదారులకు ప్రమాదం జరుగలేదు అనే విషయం స్పష్టమైంది.

    తోటి వాహనదారులు స్పందించడంతో

    తోటి వాహనదారులు స్పందించడంతో

    హైటెక్ సిటీలో ఐకియా స్టోర్ దాటిన వెంటనే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇతర వాహనదారులు వెంటనే స్పందించి సాయిధారమ్ తేజ్‌ను రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి మాదాపూర్‌లోని హాస్పిటల్‌లో చేర్పించి ప్రాథమిక చికిత్సను అందించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్ రావడం, అనంతరం సాయిధరమ్ తేజ్‌ను అపోలో హాస్పిటల్‌కు తరలించడం జరిగింది.

    మితి మీరిన బైక్ వేగంతో

    మితి మీరిన బైక్ వేగంతో

    సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంంలో గాయపడటానికి ప్రధాన కారణం మితిమీరిన వేగమే కారణమని ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకొని దానిని రివ్యూ చేశారు. త్వరలోనే పై అధికారులకు ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన రిపోర్టును అందించనున్నట్టు తెలిసింది. రిపోర్టు ఆధారంగా సాయిధరమ్ తేజ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై నిర్ధారణకు వస్తారని ట్రాఫిక్ పోలీసులు, ఇతర పోలీసు అధికారులు పేర్కొన్నారు.

    సాయిధరమ్ తేజ్‌పై నమోదైన కేసు ఇదే..

    ర్యాష్ డ్రైవింగ్ అభియోగంపై సాయిధరమ్ తేజ్‌పై గచ్చిబౌలిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇండియన్ వెహికల్ యాక్ట్ కింద ఆయనపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. సెక్షన్ 184, 336 సెక్షన్ల ప్రకారం సాయిధరమ్ తేజ్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో మితిమీరిన వేగంతో బైక్స్ నడిపే వాహనదారులకు మరింత అవగాహన కల్పిస్తాం అని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

    Recommended Video

    Bheemla Nayak Singer Mogulaiah Launches Sundarangudu Poster
    నలుగురు అపోలో వైద్యుల బృందం...

    నలుగురు అపోలో వైద్యుల బృందం...

    ఇక ఇదిలా ఉంటే.. అపోలో హాస్పిటల్‌లోని క్రిటికల్ కేర్ విభాగంలో సాయిధరమ్ తేజ్‌కు చికిత్స జరుగుతున్నది. న్యూరోసర్జన్ డాక్టర్ అలోక్ రంజాన్, క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి, పాలమనాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్, ఆర్థోపెడిక్స్ సర్జన్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డితో కూడిన బృందం ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. శనివారం ఉదయం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై బులెటిన్ రిలీజ్ చేశారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఆదివారం ఉదయం మళ్లీ బులెటిన్ అందిస్తామని వైద్యులు చెప్పారు.

    English summary
    Mega Hero Sai Dharam Tej met accident accident at Mind Space near to Hitech City. In this tragic situation, Madhapur Police Files Case On Sai Dharam Tej Accident Based On CCTV Footage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X