Don't Miss!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- News
బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
టాలీవుడ్ నంబర్ వన్ మహేష్ బాబు.. టాప్ టెన్‌లో ఇంకెవరంటే.. మీడియా సంస్థ షాకింగ్ సర్వే ఫలితాలు!
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు? అనే ఈ ప్రశ్నకు పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడిస్తోంది. తాజాగా ఆగస్టు నెలకు గాను టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు నిలవగా ఆ తరువాత రెండో స్థానంలో అల్లు అర్జున్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. అయితే ఆ జాబితాలో కొందరి స్థానాలు మారాయి, ఏమేం మారాయి అనే వివరాల్లోకి వెళితే
నువ్వే కావాలి హీరోయిన్ రిచా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. 40 అంటే నమ్ముతారా?

1-మహేష్ 2-అల్లు అర్జున్
పాపులర్ సర్వ్ కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం నిలబెట్టుకున్నారు. జూన్, జూలై నెలలలో కూడా ఆయన అదే స్థానంలో నిలవగా ఇప్పుడు అదే స్థానం సాధించారు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ కేటగిరీలో అల్లు అర్జున్ రెండో స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. చివరిగా అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది.
అందంతో కూడా సరికొత్తగా ఆకట్టుకుంటున్న సింగర్ మంగ్లీ.. బ్యూటీఫుల్ ఫొటోస్

3-ప్రభాస్ 4-పవన్ కళ్యాణ్
ఇక ఈ జాబితాలో ప్రభాస్ మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కూడా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానానికి చేరాడు. వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.
మెగాస్టార్, సూపర్ స్టార్స్ వాడుతున్న ఖరీదైన, విలాసవంతమైన కార్లు ఇవే..

5- ఎన్టీఆర్ 6-రామ్ చరణ్
ఈ జాబితాలో ఎన్టీఆర్ 5వ స్థానానికి దిగజారారు. గత నెలలో నాలుగవ స్తానంలో ఉన్న ఆయన ఇప్పుడు ఐదుకు చేరారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.ఇక ఈ జాబితాలో రామ్ చరణ్ ఎనిమిదో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకారు. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు.
Sara Ali Khan హాట్, బికినీ ఫోటోలు.. సముద్ర తీరంలో అందాల ఆరబోత!

7-నాని 8-విజయ్ దేవరకొండ
నేచురల్ స్టార్ నాని ఈ జాబితాలో ఏడవ స్థానానికి దిగజారారు. గత నెలలో ఆయన అరవ స్థానం సంపాదించారు. చివరిగా టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు శ్యాం సింగరాయ్ సినిమాతో వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమదవ స్థానానికి దిగజారారు. గత నెలలో ఏడవ నెంబర్లో ఉన్న ఆయన ఒక స్థానం ఎగబాకారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.

9-చిరంజీవి 10-వెంకటేష్
ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమా కాకుండా ఆయన మరిన్ని సినిమాలు కూడా లైన్ లో పెట్టారు. ఇక గత నెల ఈ జాబితాలో స్థానం సంపాదించిన విక్టరీ వెంకటేష్ ఈ జాబితాలో పదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది నారప్ప సినిమాతో హిట్ కొట్టి ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. మరి చూడాలి వచ్చే నెలలో పరిస్థితులు ఎలా మారతాయి అనేది.