Don't Miss!
- News
ముఖ్యమంత్రి విశాఖకు మారే అధికారం ఉంది - బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు..!!
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
తండ్రి కోసం గంటల తరబడి కష్టపడిన సితార.. మహేష్ పేరు వచ్చేలా సర్‌ప్రైజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హోదాను ఎంత పెంచుకున్నా కూడా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక ఫ్యామిలీ మ్యాన్ లా మారిపోతాడు. కొడుకు కూతురితో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతాడు. కొడుకు గౌతమ్ తో ఎంత ఫ్రెండ్లిగా ఉంటాడో గతంలో కొన్ని వీడియోలతో క్లారిటీ వచ్చేసింది. ఇక కూతురు సితారతో మాత్రం అంతకంటే ఎక్కువ క్లోజ్ గా ఉంటాడని చెప్పవచ్చు.
సితార అంటే మహేష్ కు పంచ ప్రాణాలతో సమానం. కూతురుని ఇప్పటికి కూడా తన గుండెలపై పడుకోబెట్టుకుంటాడు. ఇక వారికి సంబంధించిన లవ్లీ ఫొటోలను మహేష్ భార్య నమ్రత శిరోధ్కర్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే సితార కూడా ఇన్స్టాగ్రామ్ లో తండ్రికి సంబంధించిన ఎదో ఒక విషయం గురించి షేర్ చేసుకుంటూనే ఉంది. ఇక నేడు ఫాదర్స్ డే సందర్భంగా మహేష్ కోసం ప్రత్యేకంగా ఒక కానుక తయారు చేసినట్లు చెప్పింది.

సితారకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం.. ఇక తనకు నచ్చినట్లుగా M లెటర్ ను అందంగా పెయింట్ చేసింది. చిన్న చిన్న ఫ్లవర్స్ డ్రా చేయడానికి చాలా సమయం తీసుకుంది. గంటల తరబడి ఆ ఒక్క అక్షరాన్ని నాన్న కోసం గీసింది. ఇక దానితో నాన్నాను సర్ ప్రైజ్ చేస్తానని చెప్పిన సితార తండ్రి ప్రేమను వివరించింది. ఇక వరల్డ్ వైడ్ గా ఉన్న అందరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.