Don't Miss!
- Sports
INDvsNZ : ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి.. దీపక్ హుడాకు దిగ్గజం మద్దతు!
- News
ఎవరేం చేస్తున్నారో.. అంతా తెలుసు..!: చంద్రబాబు
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
కౌ బాయ్ లుక్కుతో మహేష్ మేనల్లుడు.. త్వరలోనే మరో సర్‌ప్రైజ్
రానున్న రోజుల్లో అగ్ర హీరోల ఫ్యామిలీ నుంచి రాబోయే హీరోల లిస్టు పెద్దగానే ఉంది. ఆ సంఖ్య రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి కూడా ఒక యువ హీరో సిద్ధంగా ఉన్నాడు. అతను మరెవరో కాదు మహేష్ బాబు సోదరి తనయుడు అశోక్ గల్లా. జయాదేవ్ గల్లా కుమారుడైన అశోక్ గత కొంతకాలంగా ఒక సినిమాతో బిజీబిజీగా కనిపిస్తున్నాడు. నిజానికి ఆ సినిమా ఎప్పుడో రావాల్సింది.
కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేయగా అందులో అశోక్ కౌ బాయ్ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గుర్రంపై ఉన్న ఆ స్టిల్ లో ఇంకా మొహాన్ని చూపించంలేదు. ఇక సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఈ దర్శకుడు నాగార్జున, నానిలతో దేవదాస్ అనే సినిమా చేశాడు.

ఇక ఇప్పుడు అశోక్ గల్లా మొదటి సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 23న టీజర్ ను రిలీజ్ చేస్తారట. అందులో అశోక్ ఫస్ట్ లుక్ పై క్లారిటీ రానుంది. ఇక సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. కేవలం ఒక నాలుగు రోజుల షూట్ మాత్రమే మిగికి ఉందట. ఆ వర్క్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పెద్దగా టైమ్ పట్టకపోవచ్చు. సినిమాను అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మిస్తుండగ జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.