For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిమానులకు చాలెంజ్ విసిరిన మహేష్ బాబు.. నా మీద ప్రేమ ఉంటే ఈ పని చేయండి అంటూ..

  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హోదా ఎంత పెరిగినా కూడా సింపుల్ గా ఉండేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. వెండితెరపై తప్పితే పర్సనల్ లైఫ్ లో పెద్దగా హడావిడిగా కనిపించడు. ఎక్కువగా కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ మ్యాన్ లా గడుపుతుంటాడు. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటాడు.

  అంతేకాకుండా వారి చేత తరచుగా మంచి పనులు చేయించాలని అనుకుంటాడు. సందర్భం వచ్చిన ప్రతి సారి కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ చేత ఏదో ఒక మంచి పని చేయిస్తూ ఉంటాడు. మరికొన్ని రోజులు మహేష్ బాబు పుట్టినరోజు వేడుక ఉండడంతో ఆ రోజు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మహేష్ మరో టాస్క్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టును కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

  అభిమానులు సిద్ధమే..

  అభిమానులు సిద్ధమే..

  మహేష్ బాబు ఏం చెప్పినా కూడా చేయడానికి సిద్ధమైన అభిమానులు కూడా ఎంతో ఆప్యాయంగా ఆ చాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. ఆగస్టు 9 మహేష్ బాబు 46వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రతిసారీ మహేష్ బాబు పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే అభిమానులు గత రెండేళ్లలో కరోనా ఉండడం వలన పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోలేదు. కానీ తోటివారికి సహాయం చేయాలని మహేష్ బాబు ఇచ్చిన పిలుపు మేరకు సూపర్ స్టార్ అభిమానులు వారి వంతు సహయాలును కూడా కొనసాగించారు.

  ప్రేమను చూపించాలి అనుకుంటే..

  ప్రేమను చూపించాలి అనుకుంటే..

  మహేష్ కేవలం చెప్పడమే కాదు తను కూడా మంచి పనులు చేస్తూ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు ఇప్పటికే చాలామంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్ లను ఉచితంగా చేయించాడు. దాదాపు 1000 మందికి పైగా చిన్నారులకు మహేష్ మరోప్రాణంగా నిలిచాడు. అతని మంచితనం అభిమానులకు మరింత దగ్గర చేస్తుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు..

  తనపై ప్రేమను చూపించాలి అనుకుంటే అందరూ కూడా ప్రకృతికి ఉపయోగపడే విధంగా విధంగా చెట్లను కాపాడాలని, కొత్తగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతికి ఆరోగ్యవంతమైన చెట్లను కాలుష్యం నుంచి కాపాడాలని ప్రకృతి బాగుంటేనే అందరు కూడా బాగుంటారని ఉన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మొక్కలు నాటాలని అదే నాకు మీరిచ్చే పుట్టినరోజు ప్రేమ అని మహేష్ బాబు వివరణ ఇచ్చాడు.

  మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే

  మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే

  మహేష్ బాబు పిలుపునివ్వడంతో అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా అప్పుడే మంచి పనులు మొదలుపెట్టారు. తప్పకుండా మా సూపర్ స్టార్ పై తమాకున్న ప్రేమను ఈ విధంగా చూపిస్తామని చాలెంజ్ ను స్వీకరించారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఉంటుందని ముఖ్యంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు కిక్కిస్తుందని చెబుతున్నారు. దర్శకుడైతే అభిమానులు చొక్కాలు చింపుకునేలా ఉంటుందని కూడా తనదైన శైలిలో చెప్పాడు.

  త్వరలోనే స్పెషల్ సాంగ్

  త్వరలోనే స్పెషల్ సాంగ్

  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో మొదటి సారి కీర్తిసురేష్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని నిర్మాతలు కూడా వివరణ ఇచ్చారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే స్పెషల్ సాంగ్ కూడా విడుదల కాబోతోందని క్లారిటీ ఇచ్చారు. ఇక మొదటి సాంగ్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో మహేష్ బాబు నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తున్న విషయం తెలిసిందే. హెయిర్ స్టైల్ తో పాటు మహేష్ ఫిట్నెస్ లో కూడా కొంత మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

  రాబోయే సినిమాలు

  రాబోయే సినిమాలు

  దర్శకుడు పరశురామ్ మహేష్ బాబును సరికొత్తగా చూపించబోతున్నారు ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ తోనే కూడా అభిమానులను కొంత క్లారిటీ వచ్చేసింది. మహేష్ తప్పకుండా సర్కారు వారి పాట బిగ్గెస్ట్ హిట్ అనుకునే ఉంటుందని అర్థం అవుతోంది. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమాలు స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాలో మహేష్ ఒక గూడచారి పాత్రలో కనిపిస్తాడని కూడా టాక్ వచ్చింది.

  రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ మరో బిగ్ బడ్జెట్ సినిమాను వచ్చే ఏడాది స్టార్ట్ చేయబోతున్నాడు . ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అయితే అంచనాలు మాములుగా లేవు. సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.

  కథ పూర్తిగా సిద్ధం అవ్వలేదు

  కథ పూర్తిగా సిద్ధం అవ్వలేదు

  అయితే పూర్తి కథ ఇంకా సిద్ధం కాలేదని రచయిత విజయేంద్రప్రసాద్ కూడా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. రాజమౌళి కూడా ఇంకా పూర్తిగా ఫోకస్ పెట్టలేదు అంటూ ఆయన ఒప్పుకున్న తర్వాతనే కథ ఫైనల్ అవుతుందని ఉన్నారు. ఇక మహేష్ బాబు కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. అసలైతే ఈపాటికే వారి కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సిందే. కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ రాజమౌళి ప్రాజెక్టులను లైన్ లో పెట్టడం వలన అనిల్ రావిపూడి వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సి వస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రాజెక్టులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  English summary
  Mahesh babu new challenges to his hardcore fans for green india support and nature love
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X