టాలీవుడ్ నెంబర్ వన్ హీరో.. మరోసారి నిరూపించుకున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత కూల్ గా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పెద్దగా వివాదాలకు వెళ్లకుండా చాలా ఈక్వల్ గా అటు ఫ్యామిలీ లైఫ్ ను అలాగే స్టార్ హోదాకు న్యాయం చేస్తుంటాడు. నిజానికి మహేష్ ఎక్కువగా ఫ్యామిలీ మ్యాన్ గా ఉండడానికే ఇష్టపడతారు. ఇక ఆయన సోషల్ మీడియాలో నెంబర్ వన్ సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు.
మహేష్ బాబు సోషల్ మీడియాలో నిరంతరం బిజీగా ఉండకపోయినప్పటికి ఎవరైనా సెలబ్రెటీల పుట్టినరోజు ఉంటే మాత్రం వెంటనే ట్వీట్ వేసేస్తారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫ్యామికి సంబంధించిన ఫొటోలు చాలనే ఉంటాయి. ఇటీవల మహేష్ ట్విట్టర్ లో మరో కొత్త రికార్డును అందుకున్నాడు. మహేష్ బాబు ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 11 మిలియన్స్ కు చేరుకుంది. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు #11MillionMAHESHIANS ట్యాగ్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

ఈ రికార్డుతో మహేష్ అత్యదిక ఫాలోవర్స్ ఉన్న నెంబర్ టాలీవుడ్ హీరోగా క్రేజ్ అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌కు 6.1 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో మరో 5.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు, టాలీవుడ్‌లో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా మహేష్ మరోసారి నిరూపించుకున్నట్లు అర్ధమయ్యింది. ఇక నెక్స్ట్ ఈ సూపర్ స్టార్ సర్కారు వారి పాట సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











