Mahesh Babu అతడు నా దేవుడు.. ఆయన బయోపిక్‌లో నటించను.. నిర్మిస్తా.. మహేష్ బాబు క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా జీఎంబీ బ్యానర్‌పై రూపొందిన చిత్రం మేజర్. ముంబై నగరంపై పాక్ ముష్కరులు దాడి జరిపిన సమయంలో తాజ్ హోటల్‌లో బస చేసిన ప్రజలను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, సాయి మంజ్రేకర్, అడివి శేషు, అనురాగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ..

మేజర్ సినిమా చివరి 30 నిమిషాలు

మేజర్ సినిమా చివరి 30 నిమిషాలు

మేజర్ సినిమా ఇటీవల చూశాను. సినిమా చూస్తున్న సేపు రోమాలు నిక్కబొడిచాయి. ఇలాంటి సినిమాను అందించిన మేజర్ టీమ్‌కు నా ధన్యవాదాలు. సినిమా చివరి 30 నిమిషాల్లో నా గొంతు ఎండిపోయింది. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మాటలు పెగల్లేవు. ఐదు నిమిషాలు మౌనంగా ఉండి.. శేషును కౌగిలించుకొన్ని కంగ్రాట్స్ చెప్పాను అని మహేష్ బాబు అన్నారు.

నేను ఆ పాత్రను చేయను..

నేను ఆ పాత్రను చేయను..

మేజర్ సినిమాలో శేషు ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంది. ఆ సినిమా చూసిన తర్వాత ఆ పాత్రను నేను చేస్తే బాగుండనే ఆలోచన నాకు రాలేదు. కొన్ని సినిమాలు కొంత మంది చేస్తేనే బాగుంటుంది. ఈ సినిమా శేషు చేస్తేనే కరెక్ట్. నేను ఆ సినిమాకు ఆడియెన్ మాత్రమే. నేను చేయాల్సిన సినిమాలు వేరు. నేను నాకు తగినట్టుగానే సినిమాలు చేస్తుంటాను. మిగితా సినిమాలు నేను ఎంజాయ్ చేయాలని అనుకొంటాను. ఈ సినిమా నేను చేస్తే బాగుంటుందనే ఆలోచన ఎప్పడు రాదు అని మహేష్ బాబు అన్నారు.

నేను ఏది పట్టుకొంటే అది బ్లాక్‌బస్టర్

నేను ఏది పట్టుకొంటే అది బ్లాక్‌బస్టర్

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సినిమా కథను ప్రతీ భారతీయుడికి, ప్రతీ సినిమా ప్రేక్షకుడికి చెప్పాల్సిన అవసరం ఉంది. గత రెండేళ్లుగా ఈ టీమ్‌ను అభినందిస్తున్నాను. అయితే నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ.. నేను రిస్క్ చేస్తుంటానని అన్నాడు. కానీ నేను రిస్క్ చేయడం లేదు. గత నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకొంటే అది బ్లాక్‌బస్టర్ అని మహేష్ బాబు అన్నారు.

సూపర్ స్టార్ సల్మాన్, పృథ్వీరాజ్‌తో ట్రైలర్

సూపర్ స్టార్ సల్మాన్, పృథ్వీరాజ్‌తో ట్రైలర్

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత అందరికి స్పూర్తిదాయకం. ఈ సినిమాను దేశవ్యాప్తంగా అందరూ చూడాలనే ఉద్దేశంతో నిర్మించాం. హిందీలో సల్మాన్ ఖాన్‌తో, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ట్రైలర్ లాంచ్ చేశాం. ఉన్నికృష్ణన్ మలయాళం భాషకు సంబంధించిన సినిమా. అందుకే పృథ్వీరాజ్‌తో ట్రైలర్ రిలీజ్ చేయించాం. సూపర్ స్టార్లతో ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎక్కువగా రీచ్ ఉంటుంది. సల్మాన్ ఖాన్‌ ట్రైలర్ రిలీజ్ చేయడం వెనుక హీరోయిన్ సాయి మంజ్రేకర్ కృషి ఉంది అని మహేష్ బాబు తెలిపారు.

ఓటీటీ కోసం భారీ ఆఫర్లు

ఓటీటీ కోసం భారీ ఆఫర్లు

మేజర్ సినిమా ప్రారంభమై నాలుగేళ్లకుపైగా అయింది. రెండేళ్ల కాలంలో రకరకాల టెన్షన్స్ అనుభవించాం. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామని చాలా భారీ అఫర్లు వచ్చాయి. కానీ మేము ఈ సినిమాను కేవలం థియేటర్‌లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఓటీటీ ఆఫర్లను అంగీకరించలేదు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రతీ ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తుంది అని మహేష్ బాబు అన్నారు.

సూపర్ స్టార్ బయోపిక్‌ను ప్రొడ్యూస్ చేస్తా

సూపర్ స్టార్ బయోపిక్‌ను ప్రొడ్యూస్ చేస్తా

సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ గురించి మహేష్ బాబు స్పందించారు. మా నాన్న గారి బయోపిక్ తీస్తే చూడటానికి ఆసక్తిగా ఉంది. ఆయన పాత్రను నేను పోషించను. ఎందుకంటే ఆయన నా దేవుడు. అందుకే ఆ ధైర్యం నేను చేయను. కానీ ఎవరైనా ఆ సినిమా తీయడానికి ముందుకు వస్తే.. నేను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను అని మహేష్ బాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X