Maharshi : ఎక్కడా తగ్గని మహేష్ బాబు..పదో సారి కూడా దుమ్ములేపిన టీఆర్పీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అంటే ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అందుకే ఆయన సినిమాలు దాదాపు అన్నీ సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా టీవీలో వేసినా సరే ప్రేక్షకులు ఆయన సినిమాని ఆదరిస్తూనే ఉన్నారు. మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఇక దిల్ రాజు, అశ్వినీదత్, పొట్లూరి వర ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2019 లో రిలీజ్ కాగా మంచి క్లీన్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తాజాగా టీవీలో ప్రసారం కాగా దానికి మంచి టిఆర్పి రేటింగ్ లభించింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చివరిగా టెలికాస్ట్ కావడం పదో సారి. అలా పది సార్లు టెలికాస్ట్ అయిన సరే 7.82 టిఆర్పి సాధించి బుల్లితెర మీద తనకు సత్తా నిరూపించుకున్నాడు మహర్షి మహేష్ బాబు. ఇక ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో మొదలు కావాల్సి ఉంది. కానీ కరోనా రెండో దశ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు షూటింగులకు పర్మిషన్ ఇస్తున్న నేపథ్యంలో మళ్లీ షూటింగ్ లో మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా బ్యాంకింగ్ మోసాల నేపధ్యంలో తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టైటిల్ కూడా వేలం పాటకు సంబందించింది పెట్టడంతో ఇదే నేపధ్యం అయి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











