twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ వివాదంపై మంచు మనోజ్: నేను వెళితే అందరికీ ఫసకే...

    By Bojja Kumar
    |

    Recommended Video

    Manchu Manoj Tweets About MAA Issue

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వ్యవహారం రెండు మూడు రోజులుగా వివాదాలతో మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్ మధ్య మొదలైన గొడవ సెపరేట్‌గా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. నిధుల గోల్ మాల్ జరిగిందనే అనుమానంతో నరేష్ ఒక ఇష్యూ లెవనెత్తగా... ప్రెసిడెంట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో తనపై ఆరోపణలు చేస్తున్నారు అనే విధంగా శివాజీ రాజా ఆరోపించారు. ఈ పరిణామాలపై మంచు మనోజ్ స్పందించారు.

    మనోజ్‌ను ‘మా' ప్రెసిడెంట్‌గా చూడాలన్న అభిమాని

    మనోజ్‌ను ‘మా' ప్రెసిడెంట్‌గా చూడాలన్న అభిమాని

    ఈ పరిణామాల నేపషథ్యంలో మంచు మనోజ్ ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది. మనోజ్ అభిమాని ఒకరు ‘మా అసోసియేషన్‌కి నిన్ను ప్రెసిడెంట్‌గా చూడాలని ఉంది బ్రో' అంటూ ట్వీట్ చేశాడు. అభిమాని చేసిన ట్వీట్‌కు మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

     నేను వస్తే అందరికీ ఫసకే..

    నేను వస్తే అందరికీ ఫసకే..

    ‘‘నేను వెళితే అపుడు తప్పకుండా అందరికీ ఫసకే. ‘మా' చాలా నిజాయితీ గల సంస్థ. సంస్థలలో ఏవో తప్పుడు వ్యవహారాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అని తప్పు అని నిరూపించడం కోసమైనా రివిజన్ కమిటీ వేస్తారని భావిస్తున్నాను.

    పారిపోవడానికి వాళ్లేమీ చికెన్స్ కాదు

    వాళ్లేమీ చికెన్స్ కాదు.. చికెన్స్‌లా దూరంగా పారిపోవడానికి. ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవడానికి వీలుగా ‘మా' తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నేను నమ్ముతున్నా. ‘మా'లో ఎలాంటి తప్పులు జరుగడం లేదని ప్రూవ్ అవుతుందని నమ్ముతున్నాను అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.

    ఫసక్ అంటే ఏమిటి?

    ఇటీవల మోహన్ బాబు ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఫసక్' అనే పదాన్ని వాడారు. దీంతో ఆ పదం కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆయన వారసులు కూడా ఈ పదాన్ని వాడుతూ... తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

    English summary
    "Maa is very genuine .. I’m sure they will keep a revision community to prove others wrong ... they r not chickens to run away like chickens .I’m sure Maa is open for anyone to come and check ... Maa just prove others wrong." Manchu Manoj tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X