తిట్టినా, పొగిడినా మీరే... మీ కూడు తింటున్నాం: మంచు మనోజ్

By Bojja Kumar

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండే హీరోల్లో మంచు మనోజ్ ఒకరు. ఎవరైనా ఫ్యాన్స్ మెసేజ్ పెడితే ఆయన తప్పకుండా రిప్లై ఇస్తారు. ఈ నేపథ్యంలో అభిమానులకు, అతడికి ఆసక్తికర కన్వర్జేషన్ జరిగింది. మోహన్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'ఫసక్' అనే పదం వాడటంతో సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి.

'ఫసక్' ట్రోలింగ్ మీద ఓ అభిమాని స్పందిస్తూ... 'అన్నా..బయట జనాలు 'ఫసక్‌' అని ట్రోల్‌ చేసినా అది మీ మీద, మీ కుటుంబంపై ఉన్న ప్రేమ వల్లే. బాధపడకండి. మా అందరికీ మంచు కుటుంబం అంటే చాలా ఇష్టం' అని ట్వీట్ చేశాడు.

దీనికి మనోజ్ రిప్లై ఇస్తూ.... .'తిట్టినా..పొగిడినా..ఆడుకున్నా..మీరే కదా బ్రదర్స్‌. మీరు పెట్టే కూడు తింటున్నాం. మాపై మీకు ఆ హక్కు ఎప్పుడూ ఉంటుంది. ఎంజాయ్‌' అని ట్వీట్ చేశారు. మనోజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరో అభిమాని... అన్నా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మీతో ఫోటో దిగినట్లు కల వచ్చింది అని ట్వీట్ చేయగా... 'తమ్ముడూ నీ కలను నిజం చేద్దాం. నీ నెంబర్ నా ఇన్ బాక్సుకు సెండ్ చేయ్' అని రిప్లై ఇచ్చారు.

Manchu Manoj reply to his twitter followers

మనోజ్ అభిమాని ఒకరు 'మా అసోసియేషన్‌కి నిన్ను ప్రెసిడెంట్‌గా చూడాలని ఉంది బ్రో' అంటూ ట్వీట్ చేశాడు. అభిమాని చేసిన ట్వీట్‌కు మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నేను వెళితే అక్కడ అందరికీ ఫసకే అంటూ రిప్లై ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X