రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మంచు విష్ణు

హీరో మంచు విష్ణు తిరుపతిలోని రుయా ఆసుపత్రి కోసం రూ. 1 కోటి విరాళం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో వివిధ వసతులు కల్పించడం కోసం ఈ మొత్తం వియోగించనున్నట్లు తెలిపారు. తన తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు(మార్చి 19) సందర్భంగా మంచు విష్ణు ఈ ప్రకటన చేశారు.

వచ్చే మూడేళ్లలో 1 కోటి రూపాయలను దశల వారీగా విరాళంగా ఇస్తానని విష్ణు తెలిపారు. పిడియాట్రిక్ డిపార్టుమెంటులో నియో నాటల్ ఐసీయూ, మెడికల్ ఐసీయూ ఏర్పాటు చేయడంతో పాటు ఎమర్జీన్సీ, ఓపిడి బ్లాక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తొలి చెక్ రుయా ఆసుపత్రి అధికారులకు అందజేశారు.

Manchu Vishnu pledges to donate Rs 1 cr for Ruia Hospital

సినిమాల విషయానికొస్తే... మంచు విష్ణు హీరోగా న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా ఓట‌ర్‌ చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై జి.ఎస్‌.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు.

మంచు విష్ణు, సుర‌భి, సంప‌త్‌రాజ్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముళి, ప్ర‌గ‌తి, ముర‌ళి, ఎల్‌.బి.శ్రీరాం, జ‌య‌ప్ర‌కాష్‌, సుప్రీత్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జి.ఎస్‌.కార్తీక్‌, నిర్మాత‌: జాన్ సుధీర్ పూదోట‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిర‌ణ్ త‌న‌మ‌ల‌, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజేష్ యాద‌వ్‌, ఎడిట‌ర్‌: కె.ఎల్‌.ప్ర‌వీణ్‌, ఆర్ట్‌: ఎం.కిర‌ణ్‌కుమార్‌, సాహిత్యం: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, ఫైట్స్‌: క‌న‌ల్ క‌న్న‌న్‌, సిల్వ‌, వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీ: భాను, శ్రీధ‌ర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X