ఎన్నికల వేళ మంచు విష్ణు సంచలనం.. టార్గెట్ ఎవరంటే?
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హీరో మంచు విష్ణు సంచలన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అవినీతి, అవకాశ వాద రాజకీయాలను టార్గెట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపబోతున్నాడు.
మంచు విష్ణు హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా ఓటర్ చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రమా రీల్స్ బ్యానర్‌పై జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా సినిమా పోస్టర్ విడుదల చేయడంతో పాటు ఏప్రిల్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సురభి హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం, రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
మంచు విష్ణు, సురభి, సంపత్‌రాజ్, నాజర్, పోసాని కృష్ణముళి, ప్రగతి, మురళి, ఎల్.బి.శ్రీరాం, జయప్రకాష్, సుప్రీత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: జి.ఎస్.కార్తీక్, నిర్మాత: జాన్ సుధీర్ పూదోట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ తనమల, మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: రాజేష్ యాదవ్, ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్, ఆర్ట్: ఎం.కిరణ్‌కుమార్, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్: కనల్ కన్నన్, సిల్వ, వెంకట్, కొరియోగ్రఫీ: భాను, శ్రీధర్.


Click it and Unblock the Notifications











