ఆమెతో ప్రేమలో పడ్డా.. వాళ్ల వల్లే నన్ను వదిలేసి.. సాయి దుర్గా తేజ్ ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి వేసిన బలమైన పునాదులపై మెగా సామ్రాజ్యం ఏర్పడింది. ఈ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తమ కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. వీరి తర్వాత చిరంజీవి చెల్లెలు కుమారుడు సాయిథరం తేజ్ సినీ రంగంలో అడుగుపెట్టి వరుస విజయాలు సాధించాడు. అయితే ఈ స్పీడ్ కంటిన్యూ చేయలేక స్టార్ రేసులో వెనుకబడ్డారు. అయితే 40కి చేరువ అవుతున్నా ఇప్పటి వరకు సాయి పెళ్లి చేసుకోకపోవడంతో పలు రూమర్స్ హల్‌చల్ చేశాయి. తాజాగా ఓ కార్యక్రమంలో తన ప్రేమ, పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు సాయితేజ్.

పదేళ్ల ప్రస్థానం
చిరంజీవి చెల్లెలు విజయ దుర్గ కుమారుడే సాయి థరమ్ తేజ్.. ఇతనికి తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఉన్నాడు. చెన్నై, హైదరాబాద్‌లలో చదువుకున్న సాయితేజ్.. 2014లో ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి చిత్రాలతో విజయాలను అందుకున్నాడు సాయి. కానీ ఆ తర్వాత ఈ కుర్రాడు నటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఫెయిల్ అయ్యాయి. కొన్నేళ్ల తర్వాత విరూపక్షతో సాలీడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు సాయితేజ్. ఆ తర్వాత తన మావయ్య పవన్ కళ్యాణ్‌తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. ప్రస్తుతం సంబరాల ఏటుగట్టు సినిమాలో ఆయన నటిస్తున్నాడు.

Mega Hero Sai Durgha Tej about his breakup with girlfriend

జీవితాన్ని మలుపు తిప్పిన యాక్సిడెంట్‌
కాగా.. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ మాదాపూర్ సమీపంలోని దుర్గం చెరువు బ్రిడ్జి వద్ద సాయితేజ్ ప్రయాణిస్తోన్న బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సాయిథరమ్ తేజ్.. చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు. అయితే సరైన సమయంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంతో సాయితేజ్ కోలుకోవడానికి ఆరు నెలలకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత విరూపాక్షతో హిట్ కొట్టి తనను తాను నిరూపించుకున్నాడు.

ఆ హీరోయిన్లతో సాయితేజ్ డేటింగ్?
అందరు నటీనటుల మాదిరిగానే సాయిథరమ్ తేజ్‌కు కూడా పులువురు హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్లు మీడియాలో విస్తృతంగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అందరిలోకి రెజినా కసాండ్రాతో సాయితేజ్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పలు సినిమాలలో రిపీటెడ్‌గా నటించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరినట్లయ్యింది. ఆ తర్వాత మరో హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదాతో కూడా సాయితేజ్ డేటింగ్ చేసినట్లుగా రూమర్స్ వచ్చాయి. ఇక తన మేనమామ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెలతో సాయితేజ్ పెళ్లి జరగబోతున్నట్లుగా కథనాలు వచ్చాయి.

మీ వల్లే విడిపోయాం
ఇదిలాఉండగా.. హైదరాబాద్‌లో జరిగిన అభయమ్ మసూమ్ సమ్మిట్‌లో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ పాల్గొన్నారు. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టడం, అవగాహన కల్పించడమే లక్ష్యంగా సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 70 నగరాలకు చెందిన పలువురు ప్రతిభావంతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయితేజ్‌కు మీడియా ప్రతినిధుల నుంచి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. కాలేజీ గర్ల్‌ఫ్రెండ్‌తో నేను ప్రేమలో పడ్డానని, కానీ హీరోయిన్లతో ఎఫైర్లు, పలానా అమ్మాయితో నా పెళ్లంటూ మీడియాలో పుకార్లు వచ్చేవి. ఇవన్నీ నా గర్ల్ ఫ్రెండ్ చూసి తను భయాందోళనకు గురై 2023లో నాకు బ్రేక్ చెప్పింది. నిజానికి మీడియా వల్లే నా జీవితంలో ఇలా జరిగింది.. అంతకుముందు చాలా బ్రేకప్స్ జరిగినా.. అత్యంత బాధను మిగిల్చింది మాత్రం ఇదే.. మీరంతా (మీడియా) సైలెంట్‌గా ఉంటే నేనే నా పెళ్లి వార్తను ప్రకటిస్తానని సాయిదుర్గా తేజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సాయితేజ్‌ను వదిలేసిన అమ్మాయి ఎవరు? అంటూ చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X