Don't Miss!
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఒకప్పుడు మా ఇంట్లో తిని అలా ఉండేవారు.. రోజా చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ పై మెగాస్టార్ సింపుల్ కౌంటర్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనడమే కాకుండా ఆయన పలు రాజకీయ అంశాలపై కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతొంది. అలాగే ఇటీవల రోజా చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలపై కూడా చిరంజీవి ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. అందుకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

రోజా కామెంట్స్
ప్రజలకు ఏ మేలు చేయలేదు ఎలాంటి సహకారాలు చేయలేదు అందుకే ముగ్గురు అన్నదమ్ములను కూడా ప్రజలు ఓడగొట్టారు. అసలు ప్రజలకు వీరు ఏం చేశారు అని ఒకప్పటి మెగాస్టార్ సహనటి రోజా చేసిన కామెంట్స్ ఇటీవల వల బాగా వైరల్ అయ్యాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆ వ్యాఖ్యలపై స్పందించిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

మెగాస్టార్ మాట్లాడుతూ..
రోజా తీవ్రస్థాయిలో కామెంట్ చేసినప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి మాత్రం సీరియస్ గా కాకుండా చాలా సున్నితంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆ అమ్మాయి ఎలా కామెంట్ చేసింది అనే విషయంపై నేను ఏ విధంగా ను కామెంట్ చేయలేను. ఎవరైనా సరే మీరు ఏం చేశారు అని అన్నప్పుడు నేను చేసిన సేవ కార్యక్రమాలు గురించి చెబితే నా స్థాయిని తగ్గించుకున్న వాన్ని అవుతాను. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ అలాగే బ్లడ్ బ్యాంకు కొనసాగించడం ఇంకా సిసిసి నేపథ్యంలో చాలామందికి సహాయం కూడా చేయడం జరిగింది.. అని మెగాస్టార్ అన్నారు.

ఒకప్పుడు నాతో అలా..
ఎవరైతే నాపై ఆ విధంగా కామెంట్ చేశారో నేను వారిపై కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. పొలిటికల్ గా ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా నేను ఏ విధంగానూ రియాక్ట్ అవ్వను. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు నాతో ఎంతో ఆప్యాయంగా ఉన్నవారు. నాతో సహానటిగా పాల్గొన్నవారు. అలాగే మా ఇంటికి కూడా చాలాసార్లు వచ్చారు. మా ఇంట్లో భోజనం చేశారు. సొంత మనుషుల్లాగా ఒకప్పుడు తిరిగారు. అలాంటివారు వారి మెంటాలిటీ తో సమయానుకూలంగా మాట్లాడినప్పుడు నేను మాత్రం నెగిటివ్ గా మాట్లాడలేను అని మెగాస్టార్ అన్నారు.

వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను
ఎప్పుడైనా సరే నాతో ఉన్నవారికి సంబంధించిన ప్రేమలకు ఆప్యాయతకు నేను విలువనిచ్చే మనిషిని. ఇప్పుడు వారు ఏదో అన్నారని నేను విలువలను సెంటిమెంట్స్ మర్చిపోయి వారిపై కౌంటర్ చేయలేను. ఆ విధంగా నేను విలువనిస్తాను. కానీ ఎదుటివారు సమయానుకూలంగా ఇష్టం వచ్చినట్లు మారిపోతూ ఉంటారు.. అది వారి నైజం. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంకా వారు ఏం మాట్లాడుతారో మాట్లాడనివ్వండి.. అని చిరంజీవి అన్నారు.

రోజా ఆ స్థానంలో ఉంటే..
సెంటిమెంట్ కి ప్రేమలకు వాత్సల్యానికి విలువ లేదా? ఇంతేనా ప్రపంచం అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగే రాజకీయాలు అంటే ఇలానే ఉండాలా? వేరే విధంగా ఉండకూడదా అని అనిపిస్తూ ఉంటుంది. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరిపై కఠినంగా మాట్లాడలేదు. నాతో స్నేహంగా ఉన్నవారు అలాగే నాతో వర్క్ చేసిన వారిపై ఇప్పటికీ కూడా ఒకే తరహాలో స్పందించాను. అలాగే మా ఇంటికి వచ్చినప్పుడు ఆడపడుచువచ్చిన తరహాలోనే చీర పసుపు కుంకుమలు పెట్టి గౌరవిస్తాను. ఆ స్థానంలో రోజా ఉన్నా.. ఎవరైనా సరే అదే తరహాలో ఆదరిస్తాను అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.