రెండు సినిమాలు ఒకేసారి.. మెగాస్టార్ చిరంజీవి అస్సలు తగ్గట్లేదుగా!
మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులోకి వచ్చారు అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫీట్నెస్, ఫేస్ లుక్స్ అలా ఉంటాయి మరి. వీలైనంత వరకు బ్యాలెన్స్ గా వెళ్లే మెగాస్టార్ స్పీడ్ విషయంలో మాత్రం పెద్దగా తేడా కనిపించడం లేదు. అప్పట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఆయన స్టెప్పులు చూస్తేనే ఈజీగా అర్ధమవుతోంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ముందుగా ఆచార్య సినిమాతో పర్ఫెక్ట్ హిట్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో రామ్ చరణ్ కూడా మరొక పాత్రలో నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఆచార్య అయిపోగానే లూసిఫర్ సెట్స్ పైకి రాబోతోంది. ఆ సినిమాను కూడా మెగాస్టార్ వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

ఇక అదే సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో చేయాల్సిన కథను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట. వారంలో మూడు రోజులు అటు, మూడు రోజులు ఇటు అనేలా ప్లాన్ చేస్తున్నారట. డేట్స్ విషయంలో క్లాష్ అవ్వకుండా ముందు జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నారని సమాచారం. ఏదేమైనా ఈ రెండు సినిమాలను ఇదే ఏడాదిలో ఫినిష్ చేయాలని మెగాస్టార్ ఫిక్స్ అయ్యారట. ఇక విడుదల తేదిని కరోనా నిర్ణయిస్తుంది. మరోవైపు మెహర్ రమేష్ కూడా వేదాళం రీమేక్ ను స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి మెగాస్టార్ డేట్స్ కోసం వేయిట్ చేస్తున్నాడు. మరి ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











