Waltair Veerayya: 154లు పోస్టర్లతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్.. ఆ రాష్ట్రంలో ఊర మాస్ క్రేజ్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఈ సినిమా విడుదలవుతోందన్న మూడు రోజుల్లో ఫ్యాన్స్ లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో మెగాస్టార్ చిరంజీవి తప్పకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ తో షేక్ చేయబోతున్నాడు అని అర్థమవుతోంది. ఇక టాక్ ఎలా ఉన్నా కూడా మెగాస్టార్ యాక్టింగ్ అలాగే రవితేజ మాస్ ఇమేజ్ సినిమాలో అద్భుతంగా సెట్ అయింది అని అంటున్నారు.

సినిమా తప్పకుండా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ చాలా హడావిడిగా కనిపిస్తున్నారు. అయితే విడుదలకు ఒక రోజు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కూడా ధియేటర్ల వద్ద హంగామా స్టార్ట్ చేశారు. అయితే కర్ణాటకలో కూడా మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉన్నట్లు చాలాసార్లు అర్థమైంది. అయితే ఈసారి వాల్తేరు వీరయ్య సినిమా సందర్భంగా కర్ణాటకలో మెగా ఫాన్స్ చేసిన సందడి కూడా చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది.

బెంగళూరులోని మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఏకంగా 54 ఆటోల ద్వారా పోస్టర్లతో ర్యాలీ నిర్వహించడం వైరల్ గా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా మెగాస్టార్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నట్లుగా అర్థమయింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా బాబీ దర్శకత్వం వహించాడు.

Megastar chiranjeevi karnataka fans big rally with Waltair Veerayya posters

ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో దేవిశ్రీప్రసాద్ అదరగొట్టేశాడు అని అంటున్నారు. సంక్రాంతి పండుగ రోజు కూడా ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X