twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమిర్ ఖాన్ విషయంలో నేను తొందరపడలేదు.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

    |

    బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సినిమాను కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

    ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో గీత ఆర్ట్స్ ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఆమిర్ ఖాన్ గురించి మాట్లాడిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. అమీర్ ఖాన్ భారత దేశంలో ఒక గర్వించదగ్గర నటుడు అని అతను ఒక ఖజానా లాంటి యాక్టర్ అని అన్నారు.

    Megastar chiranjeevi latest comments on aamir khan

    అలాగే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు అని అతను నటించే విధానం నడవడిక కూడా నాకు ఎంతగానో నచ్చుతుంది అని అన్నారు. ఇక అమీర్ ఖాన్ తరహాలోనే తాము సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నామని కానీ మాకు ఉన్న బౌండరీల వలన అవి సాధ్యపడటం లేదు అని అన్నారు. అలాగే అమీర్ ఖాన్ నటనకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే అంటూ ఈ సినిమాను నేను తొందరపడి ఒప్పుకోలేదని గర్వపడి ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాను అని మెగాస్టార్ వివరణ ఇచ్చారు.

    ఇక తెలుగు సినిమా ట్రైలర్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. అలాగే ఈ వేడుకలో నాగచైతన్య అమీర్ ఖాన్ చేత తెలుగు డైలాగ్ కూడా చెప్పించారు. లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య కూడా ఒక ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించడం జరిగింది తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం అయితే ఉంది బాలీవుడ్ లో కూడా చాలా రోజుల తర్వాత వస్తున్న బిగ్ స్టార్ సినిమా కావడంతో అందరి ఫోకస్ ఈ సినిమా పైనే ఉంది. మరి లాల్ సింగ్ చద్దా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Megastar chiranjeevi latest comments on aamir khan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X