twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి బాలకృష్ణ మిస్సింగ్.. పోలీసుల‌కు ఫిర్యాదు.. అసలేం జ‌రిగిందంటే ?

    |

    అదేంటి నందమూరి బాలకృష్ణ కనబడకపోవడం ఏమిటి అని అనుకుంటున్నారా? అవును నిజమే నందమూరి బాలకృష్ణ కనిపించడం లేదు అంటూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఒక పోలీసు కేసు నమోదయ్యింది. అసలు ఏం జరిగింది? ఎవరు పోలీస్ కేసు పెట్టారు? అనే వివరాల్లోకి వెళితే

    బిజీ బిజీగా

    బిజీ బిజీగా


    తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉంటారు. ఈ రెండింటినీ మేనేజ్ చేస్తూనే ఆయన తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కూడా బాధ్యతలు నిర్వహిస్తూ అనేకమంది పేదల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ముఖ్యమైన పనులు చూసుకుంటూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ నియోజకవర్గానికి అడపాదడపా వెళుతూ ఉంటారు.

    ఖండ సినిమాతో సూపర్ హిట్

    ఖండ సినిమాతో సూపర్ హిట్


    ఇటీవల అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ హిందూపురం వెళ్లి చాలా రోజులు అయింది. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల కాగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది అలాగే నితిన్ మెహతా, శ్రీకాంత్ విలన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 21వ తేదీ నుంచి ఆన్లైన్ వేదికగా హాట్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఓ టి టి లో కూడా టాప్ ప్లేస్ లో ఈ సినిమా దూసుకుపోతోంది అంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంత బాగా ఆదరిస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు.

    కొత్త జిల్లాలు ఏర్పాటు

    కొత్త జిల్లాలు ఏర్పాటు


    అయితే నందమూరి బాలకృష్ణ మీరు ఫిర్యాదు చేసిన అంశం విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలతో పాటు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జిల్లాల ఏర్పాటు విషయంలో కొన్నిచోట్ల తమకు అనుకూలంగా లేదు అని చెబుతూ ప్రజలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోంది.

    నిరసన

    నిరసన

    అయితే అరకు మాత్రం రెండు జిల్లాలుగా విభజించి మొత్తం 26 జిల్లాలుగా ప్రకటించింది. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే హిందూపురం పార్లమెంటు స్థానం కూడా ఉండడంతో హిందూపురం జిల్లా ఏర్పడుతుందని అక్కడి ప్రజలు భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం పుట్టపర్తి సాయిబాబా పేరిట పుట్టపర్తి సత్యసాయి జిల్లా గా ఒక జిల్లా ఏర్పాటు చేసింది. రెండూ పక్కపక్కనే ఉంటాయి కానీ హిందూపురంనీ జిల్లాగా ప్రకటించకపోవడంతో హిందూపురం జిల్లా పరిధిలో వచ్చే వారందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

     చలనం లేదని

    చలనం లేదని

    తాజాగా హిందూపురం జిల్లా ప్రకటించాలని కోరుతూ హిందూపురం నియోజకవర్గంలో అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రజాప్రతినిధులు కనపడడం లేదు అని చెబుతూ నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన స్థానిక బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా హిందూపురం జిల్లా కేంద్రంగా చేయాలని కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ వారిలో ఏ ఒక్కరిలో కూడా చలనం లేదని అందుకే విషయంపై స్పందించడం లేదని ఆరోపణలు చేశారు.

     వీడియో విడుదల

    వీడియో విడుదల

    అయితే నిజానికి బాలకృష్ణ ఈ విషయం మీద స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. హిందూపురం ఎంపీ స్థానం గా ఉంది కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ మొత్తం మీద ఏ ప్రాతిపదికన జిల్లాలోని విభజించారురో, హిందూపురం కూడా అదేవిధంగా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియో సదరు నేతల దృష్టిలో పడలేదో లేక బాలకృష్ణ సినిమా నటుడు కాబట్టి ఆయన మీద కూడా ఫిర్యాదు చేస్తే తమ నిరసనకు మరింత బూస్ట్ వస్తుంది అనుకున్నారో ఏమో తెలియదు గానీ బాలకృష్ణ కనబడడం లేదు వెతికి పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    English summary
    Missing complaint of nandamuri balakrishna in hindupur
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X