twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్‌ తర్వాత చెంపలేసుకొన్న కమెడియన్.. బాధపెట్టాను, క్షమించండి!

    |

    టాలీవుడ్‌లో ఫిబ్రవరి 22న ఐదు చిత్రాలు వెండితెరను తాకాయి. వాటిలో ఎన్టీఆర్: మహానాయకుడు, మిఠాయి సినిమాలు విడుదలకు ముందు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలు కంటెంట్ పరంగాను, ఫెర్ఫార్మెన్స్ పరంగాను ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాననే వాదన బలంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయినందుగాను.. ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయినందుకు రాంచరణ్ ఇటీవల క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో మిఠాయి హీరో, కమెడియన్ రాహుల్ రామకృష్ణ తన తప్పుును ఒప్పుకొంటూ బహిరంగ లేఖను సోషల్ మీడియాలో విడుదల చేయడం చర్చనీయాంశమైంది. అదే అదేమిటంటే..

    మిఠాయి సినిమా గురించి

    మిఠాయి సినిమా గురించి

    మిఠాయి సినిమాను ఆసక్తికరంగాను, ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ ఫలితాన్ని ముందే ఊహించాను. అందుకే సినిమాను ప్రమోట్ చేయకుండా దూరంగా ఉన్నాను అని రాహుల్ రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నాడు.

    రెండు రకాలుగా గుణపాఠం

    రెండు రకాలుగా గుణపాఠం

    మిఠాయి ఫలితాన్ని పక్కనపెడితే, ఇప్పటికీ డైరెక్టర్ విజన్, ఆలోచనపై నాకు గౌరవం ఉంది. ఈ సినిమా నాకు రెండు రకాల గుణాపాఠాన్ని నేర్పింది. ఒకటి ఓ వ్యక్తి ప్రతిభ, నైపుణ్యాన్ని అంచనావేయడం, ఒత్తిడికి గురై పనిచేయడం వల్ల మంచి ఫలితాన్ని రాబట్టుకోలేమని తెలిసింది అని అన్నారు. రెండోది సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందనే విషయంపై చాలా మంది నుంచి వందలాది మెసేజేస్ వచ్చాయి. దాంతో నాపై ఎంత బాధ్యత ఉందో అనే విషయం అర్ధమైంది అని రాహుల్ రామకృష్ణ అన్నారు.

    ఇదే నా ప్రామిస్

    ఇదే నా ప్రామిస్

    మిఠాయి పరాజయం తర్వాత మీకు ఓ ప్రామిస్ చేస్తున్నాను. ఇక ముందు రాబోయే సినిమాలో నేను, ప్రియదర్శి తెర మీద మళ్లీ అద్భుతంగా కనిపిస్తామని హామీ ఇస్తున్నాను. ఇప్పటికీ మాకు సంబంధించినంత వరకు మేము మంచి నటనను కనబరిచామని విశ్వసిస్తున్నా అని ఉద్వేగభరితమైన లేఖను సంధించాడు.

    నిజాయితీతో కూడిన తీర్పు

    నిజాయితీతో కూడిన తీర్పు

    మిఠాయి సినిమాపై ప్రేక్షకులు నిజాయితీగా వెల్లడించిన తీర్పుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిత్య విద్యార్థిగా ఈ సినిమా అందించిన తీపి, చేదు గుర్తులను హృదయంలో దాచుకొంటాను. ఈ చేదు అనుభవం నుంచి మీరు తొందర్లోనే బయటపడుతారని ఆశిస్తూ... సెలవు తీసుకొంటున్నాను అని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు.

    కామెడీ చాలా కష్టమని అర్ధమైంది

    కామెడీ చాలా కష్టమని అర్ధమైంది

    కామెడీ కథలను రాయడం చాలా సులభమైన పని అనుకొంటారు. ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో హస్యాన్ని పండించడం ఎంత కష్టమో మిఠాయితో అర్థమైంది. అలాగే నన్ను కమెడియన్ అందరూ అంటుంటారు. కానీ దానికి నేను అర్హుడిని కాను అనేది నా ఫిలింగ్. నాకు ఆ హోదా దక్కడం నిజంగా అదృష్ణం. కానీ కామెడీ పండించడమనేది అత్యంత కష్టమైన పని అని మరోసారి అర్ధమైంది అని ఎమోషనల్‌గా లేఖను ముగించారు.

    English summary
    Actor, Comedian Rahul Ramakrishna apologises for Prashant Kumar's 'Mithai' failure at box office. He wrote a letter in social media that, We tried our best to repair the film but our efforts were in vain. I had predicted this outcome of the film and was reluctant to promote it. My apologies to everybody for yesterday’s experience at the theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X