twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మురళీమోహన్ ఆరోగ్యంపై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరో.. మెగాస్టార్ పరామర్శ

    |

    Recommended Video

    VIDEO: Actor Murali Mohan Given Clarity On His Health News | Filmibeat Telugu

    టాలీవుడ్‌లో సీనియర్ హీరో, మాజీ ఎంపీ మురళీ మోహన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్తలు మీడియాలో వైరల్ కావడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. దాంతో తన అనారోగ్యంపై మురళీమోహన్ స్వయంగా వివరణ ఇచ్చిన వీడియోను విడుదల చేశారు. గత కొద్ది రోజుల క్రితం మురళీ మోహన్ తల్లి మరణించడం తెలిసిందే. అయితే తన తల్లి అస్థికలను నిమజ్జనం చేసేందుకు వారణాసి వెళ్లిన ఆయన అక్కడే అనారోగ్యానికి లోనయ్యారు. ఆ విషయంపై ఆయన క్లారిటీ వచ్చారు. వీడియోలో ఆయన ఏమన్నారంటే..

    తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా

    తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా

    మా అమ్మగారి అస్థికలు నిమజ్జనం కోసం మే 14 తేదీన అలహాబాద్, వారణాసికి వెళ్లాను. మధ్యాహ్నం అలహాబాద్‌లో, ఆ తర్వాత వారణాసిలో అస్థికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా కాళ్లు చచ్చుబడిపోయినట్టు అనిపించాయి. నడవటానికి వీలు లేని పరిస్థితి ఎదురు కావడంతో నేను వెంటే హైదరాబాద్‌కు వచ్చేసి నేరుగా కేర్ హాస్పిటల్‌కు వెళ్లాను అని మురళీ మోహన్ వీడియోలో వెల్లడించారు.

     వెన్నెముకలో తీవ్ర సమస్య

    వెన్నెముకలో తీవ్ర సమస్య

    అనంతరం కేర్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకొన్నాను. పరీక్షల అనంతరం వెన్నుముకలోని కొన్ని పూసల్లో సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. అందుకు ఆపరేషన్ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. వెన్నుముకకు చాలా సున్నితమైన సర్జరీ కావడంతో ఆలోచించుకోవడానికి సమయం తీసుకొన్నాను. పలువురు వైద్యులను సంప్రదించిన తర్వాత సర్జరీకి సిద్ధమయ్యాను అని మురళీ మోహన్ తెలిపారు.

     సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది

    సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది

    వెన్నుపూసకు సర్జరీ అత్యవసరం కావడంతో మే 24న నాకు కేర్ ఆస్పత్రిలో సర్జరీ నిర్వహించారు. అతిసున్నితంగా, జాగ్రత్తగా చేయాల్సిన ఆపరేషన్‌ను వైద్యులు సక్సెస్ ఫుల్‌గా చేశారు. మే 31 తేదీ రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాను. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉంది. కొద్ది రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. నా అనారోగ్యంపై కలత చెందినట్టు తెలిసింది.

    15 రోజుల విశ్రాంతి అవసరం

    వెన్నుముకకు జరిగిన ఆపరేషన్ తర్వాత కోలుకోనేందుకు దాదాపు 15 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మే 7 తేదీన ఆపరేషన్‌కు సంబంధించిన కుట్లు విప్పదీస్తారు. 10 తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారు. దాంతో ఎవరినీ కలువడం లేదు. 10 తేదీ తర్వాత నా సన్నిహితులను కలువడానికి వీలుంటుంది.

    వీలైతే నేను వచ్చి కలుస్తాను

    వీలైతే నేను వచ్చి కలుస్తాను

    ఒకవేళ వీలైతే, ఆరోగ్యం సహకరిస్తే నేను రాజమండ్రికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వీలుకాకపోతే నేను సమాచారం అందిస్తాను. ఆ సమయంలో ఒక్కసారిగా కాకుండా ఒక్కొక్కరు కలిస్తే బాగుంటుంది అని మురళీ మోహన్ అన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు, సన్నిహితులు, స్నేహితుల కోసం ఈ వీడియోను కుటుంబ సభ్యులు విడుదల చేశారు.

     మెగాస్టార్ చిరంజీవి పరామర్శ

    మెగాస్టార్ చిరంజీవి పరామర్శ

    కాగా, వెన్నుముక ఆపరేషన్ చేయించుకున్న మురళీమోహన్‌ను మెగాస్టార్ చిరంజీవి దంపతులు పరామర్శించారు. సర్జరీ అనంతరం చిరంజీవి సతీసమేతంగా వెళ్లి మురళీమోహన్‌ను ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు సినీ ప్రముఖులు కూడా మురళీ మోహన్‌ను పరామర్శించారు.

    English summary
    Actor Murali Mohan given clarity on his health news. He is now recovering from spine surgery. On this occassion, Megastar Chiranjeevi met Murali Mohan and wishes speedy recovery.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X