Don't Miss!
- News
Lady: ప్రతీకారం, 58 ఏళ్ల ఆంటీని రేప్ చేసి చంపేసిన 16 ఏళ్ల అబ్బాయి, పగతో ప్రైవేట్ పార్ట్స్ ను వదల్లేదు !
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సినిమా మధ్యలోనే లేచి వెళ్తున్నారు.. గుండె పగిలినంత పని.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్
అక్కినేని నటవారసుడు నాగచైతన్య తాజాగా లాల్ సింగ్ చడ్డా సినిమాతో తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాపై బోలెడ్ ఆశలు పెట్టుకొన్న చైతూకు ఈ సినిమాను నిరాశపరిచిందనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో నాగచైతన్య తన తొలి సినిమా అనుభవాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ..

2009లో జోష్ సినిమాతో
నాగచైతన్య 2009లో జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అక్కినేని కుటుంబం నుంచి హీరో వస్తుండటంతో సినీ అభిమానుల్లో, అక్కినేని ఫ్యాన్స్ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్ డే రోజునే భారీ వసూళ్లు నమోదయ్యాయి. అయితే తన తొలి సినిమా మిగిల్చిన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకొన్నారు.

ప్రేక్షకులు క్లైమాక్స్‌కు ముందే
నా
మొదటి
సినిమా
జోష్
రిలీజ్
రోజున
థియేటర్‌కు
వెళ్లి
చూశాను.
అయితే
సినిమా
మధ్యలోనే
ప్రేక్షకులు
లేచి
బయటకు
వెళ్లిపోవడం
చూసి
నేను
దిగ్బ్రాంతికి
గురయ్యాను.
వాళ్లు
మధ్యలోనే
లేచి
వెళ్తుండటం
చూసి
గుండె
పగిలినంత
పనైంది.
దాంతో
నా
కెరీర్
ఎలా
సాగుతుందో
అనే
భయం
కూడా
ఏర్పడింది
అని
నాగచైతన్య
తెలిపారు.

జోష్ మూవీ అనుభవంతో
జోష్
సినిమా
తర్వాత
నేను
ప్రేక్షకులకు
వినోదాన్ని
అందించాలనే
విషయాన్ని
గ్రహించాను.
ప్రేక్షకులను
ఆకట్టుకోకపోతే
అదే
పరిస్థితి
రిపీట్
అవుతుందని
అనుకొన్నాను.
జోష్
సినిమా
తొలి
రోజు
థియేటర్‌లో
జరిగిన
అనుభవంతో
నేను
చాలా
నేర్చుకొన్నాను
అని
నాగచైతన్య
అన్నారు.

అందుకే నాకు ఆ భయం
జోష్
సినిమా
తర్వాత
మళ్లీ
నేను
థియేటర్‌కు
వెళ్లి
మొదటి
రోజున
సినిమా
చూడలేదు.
జోష్
చేదు
అనుభవం
చెరుగని
మెమొరీగా
మారింది.
అందుకే
తొలి
రోజు
సినిమాకు
వెళ్లి
చూడటానికి
భయపడుతుంటాను.
చాలా
మంది
నటులు,
హీరోలు
సినిమా
రిలీజ్
రోజున
థియేటర్‌కు
వెళ్లి
ఎంజాయ్
చేస్తుంటారు.
కానీ
నేను
ఆ
పని
చేయడానికి
ఓ
రకమైన
భయం
ఉంటుంది
అని
నాగచైతన్య
చెప్పారు.

థియేటర్‌కు వెళ్లాలంటే భయం
రిలీజ్
రోజున
నేను
థియేటర్‌కు
వెళ్లి
సినిమా
చూస్తే..
ఒకవేళ
ప్రేక్షకులు
రెస్పాండ్
కాకపోతే..
లేదా
కామెడీ
సీన్లకు
నవ్వకపోతే..
ఒకవేళ
సినిమా
నచ్చక
మధ్యలోనే
లేచి
వెళ్లిపోతారేమో
అనే
భయం
వెంటాడుతూనే
ఉంటుంది
అని
నాగచైతన్య
చెప్పారు.
Recommended Video


లాల్ సింగ్ చడ్డా పరిస్థితి కూడా
అయితే నాగచైతన్య నటించిన తొలి బాలీవుడ్ చిత్రం పరిస్థితి కూడా జోష్ సినిమా మాదిరిగానే ఉంది. నిడివి కారణంగా ప్రేక్షకులు చివరి వరకు ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ చైతన్య థియేటర్‌కు వెళ్లి ఉంటే.. జోష్ సీన్ రిపీట్ అయి ఉండేది. కాబట్టి చైతూ లాల్ సింగ్ చడ్డా సినిమాను థియేటర్లలో చూడకపోవడమే మంచిదైందనే మాట వినిపిస్తున్నది.