For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగ చైతన్య కెరీర్‌లోనే తొలిసారి ఆ ప్రయోగం: వామ్మో తెలుగులో ఏ హీరోకూ సాధ్యం కాని విధంగా!

  |

  అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్‌ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు.. కొంత కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'మజిలీ' అనే మూవీ నుంచి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే 'వెంకీ మామ'తో మరో సక్సెస్‌ను అందుకుని ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను అలరించేందుకు మరెన్నో ప్రయోగాలు చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు.

  Maestro Full Movie: నితిన్‌కు బిగ్ షాక్.. రిలీజ్ అయిన గంటల్లోనే లీక్.. ఆ సైట్‌లో డౌన్‌లోడ్ లింక్

  అక్కినేని నాగ చైతన్య.. సాయి పల్లవితో కలిసి ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఇది పట్టాలపై ఉన్న సమయంలోనే ఈ అక్కినేని హీరో.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. ఇది కూడా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఇప్పటి వరకూ కంప్లీట్ అయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నారు. ఈ చిత్రంపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

   Naga Chaitanya Web Series Starts From December

  ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తోన్న నాగ చైతన్య.. హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంలోనూ కీలక పాత్రను చేస్తున్నాడు. ఇందులో దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా అతడు పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే తన తండ్రి అక్కినేని నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' అనే సినిమాను మొదలు పెట్టాడు చైతూ. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన'కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇది రెండు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసేసుకుంది.

  చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న అక్కినేని నాగ చైతన్య.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. అతడు అమెజాన్ ప్రైమ్ సంస్థ కోసం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడట. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న దీని ద్వారానే ఈ టాలెంటెడ్ హీరో ఓటీటీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర ఎంతో కొత్తగా ఉండబోతుందని తెలిసింది. కెరీర్‌లోనే తొలిసారి ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడట ఈ స్టార్ కిడ్.

  Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

  ఈ వెబ్ సిరీస్‌ను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన విక్రమ్ కే కుమార్ తెరకెక్కించబోతున్నాడట. ఇది అతడి స్టైల్‌లో ఉంటూనే సరికొత్త ఎలిమెంట్స్‌తో సాగబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక, తాజాగా బయటకు వచ్చిన మరో విషయం ఏమిటంటే.. ఈ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందట. దీని కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్‌ను కూడా నిర్మించబోతున్నారని సమాచారం. అప్పటి వరకూ నాగ చైతన్య 'బంగార్రాజు' మూవీని పూర్తి చేయబోతున్నాడని తెలుస్తోంది.

  English summary
  Akkineni Naga Chaitanya Alredy Doing 3 Movies. and Now He Green Signal to Web Series for Amazon Prime. This Will be Starts from December.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X