స్టార్ డైరెక్టర్ శిష్యుడితో నాగశౌర్య మరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ కొత్తగా ఉందే!
సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవ్వాలి అంటే మొదట ఒక్క పాట హిట్టయితే చాలని కొన్ని సినిమాలు నిరూపించాయి. అదే విధంగా నేటి ట్రెండ్ లో టైటిల్స్ కూడా ఎంత డిఫరెంట్ గా ఉంటే జనాల్లో అంత ఈజీగా పబ్లిసిటీ వచ్చేస్తుంది. గత కొంతకాలంగా యువ హీరోలు సెలెక్ట్ చేసుకుంటున్న టైటిల్స్ చాలా డిఫరెంట్ ఉంటున్నాయనే చెప్పాలి.
ఇక యువ హీరో నాగశౌర్య కూడా త్వరలో ఒక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్టర్ సినిమాను తెలుగులో విడుదల చేసిన మహేష్ కోనేరు నిర్మాతగా రూపొందిస్తున్న కొత్త సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. సినిమాకు కొత్త దర్శకుడు రాజా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ డైరెక్టర్ ఇంతకుముందు హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేశాడు.

ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే.. 'పోలీస్ వారి హెచ్చరిక' అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిఫరెంట్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య కూడా చాలా కొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సింది. శుక్రవారం సినిమాకు సంబంధించిన టైటిల్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











