Just In
- 2 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తారక్‌తో అనుబంధంపై కల్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఫొటో చూడగానే ఏడ్చేశాడు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీలలో నందమూరి కుటుంబం కొంత ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. దీనికి కారణం ఆ కుటుంబ మూల పురుషుడు నందమూరి తారక రామారావు కావడమే. సినిమా హీరోగానే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగానూ ఆయన పని చేశారు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక, ఆయన వారసులుగా పలువురు సినీ రంగ ప్రవేశం కూడా చేశారు. ఆ తర్వాతి తరం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది.
వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్.. తన తమ్ముడు తారక్‌తో అనుబంధంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు, ఓ ఫొటో చూసి ఏడ్చేశాడు. ఇంతకీ ఏం జరిగింది.? వివరాల్లోకి వెళితే....

వాళ్లిద్దరికీ జూనియర్ ఎన్టీఆర్ యాడ్ అయ్యాడు
నందమూరి హరికృష్ణ గురించి తెలియని వారు ఉండరు. ఈయన సినిమాలతో పాటు రాజకీయాల్లో తనదైన శైలితో పేరు సంపాదించుకున్నారు. ఈయనకు ముగ్గురు కుమారులు. వారిలో కల్యాణ్ రామ్, జానకిరామ్ మొదటి భార్యకు జన్మించగా.. జూనియర్ ఎన్టీఆర్ రెండో భార్య సంతానం. ఈ ముగ్గురిలో జానకిరామ్ కొన్నేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

అందులో మాత్రం ఒకరికి ఒకరుగా ఉంటారు
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎంత ప్రేమగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ పరంగానే కాకుండా.. వ్యక్తిగత జీవితంలోనూ ఈ సోదరులు ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తున్నారు. కొంత కాలంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగిపోయింది. సినిమాలకు సంబంధించిన సలహాలు, సూచనలను పంచుకుంటూ ఈ అన్నాదమ్ములిద్దరూ ముందుకు వెళ్తున్నారు.

అక్కడ మాత్రం తప్పుకుండా ఉంటున్నారు
కల్యాణ్ రామ్ నటించిన సినిమా అయినా.. జూనియర్ ఎన్టీఆర్ మూవీ అయినా.. నందమూరి అభిమానులకు మాత్రం కన్నుల పండుగే. దీనికి కారణం ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు హాజరవడమే. ఆ సమయంలో ప్రత్యేకంగా ఈ ఇద్దరూ కలిసి వస్తుంటారు. దీంతో ఈ అన్నాదమ్ముల బంధం గురించి చాలా మంది చర్చించుకుంటూ ఉంటారు.

తారక్‌తో అనుబంధంపై కల్యాణ్ రామ్ కామెంట్స్
తారక్‌ను కల్యాణ్ రామ్ ‘నాన్న' అని సంబోధిస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే. తాజాగా అలీతో సరదాగా అనే ప్రోగ్రామ్‌కు గెస్టుగా వచ్చిన కల్యాణ్ రామ్ ఈ విషయంపై మాట్లాడాడు. ‘తారక్‌ను తమ్ముడు అని ఎప్పుడూ పిలవలేదు. అసలు అలా పిలవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ నాన్న అని అంటుంటాను' అని ఆయన చెప్పుకొచ్చాడు.

ఆ ఫొటో చూడగానే కల్యాణ్ రామ్ ఏడ్చేశాడు.!
ఇదే షోలో తన తండ్రి హరికృష్ణ గురించి కూడా కల్యాణ్ రామ్ మాట్లాడాడు. ‘మా నాన్న ఎంతో బాధ్యత ఉన్న వ్యక్తి. తండ్రిగా మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవారు' అని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. అంతేకాదు, తారక్‌ను నాన్న అని పిలవడానికి కారణం కూడా ఇదేనని వెల్లడించాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కల్యాణ్ రామ్ అందుకే అక్కడికి వచ్చాడు
కల్యాణ్ రామ్ - వేగేశ్న సతీష్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా'. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ జనవరి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే కల్యాణ్ రామ్ ఈ ప్రోగ్రామ్‌కు వచ్చాడు.